PriyankaChopra: ప్రపంచ స్థాయి అవార్డు అందుకోనున్న నటి ప్రియాంక చోప్రా..

PriyankaChopra: ప్రపంచ స్థాయి అవార్డు అందుకోనున్న నటి ప్రియాంక చోప్రా..

అందం, నటన‌తో ప్రేక్షకులను మెప్పించిన నటి ప్రియాంక చోప్రా (PriyankaChopra). పదేండ్లు బాలీవుడ్ ను ఏలిన ఈ భామ ఏకంగా హాలీవుడ్ ను సైతం తన నటన ఫిదా చేసింది. దాంతో ప్రియాంక చోప్రా గ్లోబల్ బ్యూటీగా మారింది. అలాంటి ప్రియాంక చోప్రాను ఓ అరుదైన అవార్డు వరించింది. లాస్ ఏంజిల్స్‌లో గ్లోబల్ వాన్‌గార్డ్ గౌరవాన్ని అందుకోనున్నారు ప్రియాంక చోప్రా.

25 సంవత్సరాలుగా సినిమా రంగానికి ఆమె చేసిన సేవలకు గాను.. ఈ అత్యున్నత పురస్కారంతో సత్కరిస్తున్నారు. మే 10న డౌన్‌టౌన్ లాస్ ఏంజిల్స్‌లోని మ్యూజిక్ సెంటర్‌లో జరగనున్న నాల్గవ వార్షిక గోల్డ్ హౌస్ గాలాలో ప్రియాంకతో పాటు, రాపర్ మేగాన్ థీ స్టాలియన్, అకాడమీ అవార్డు గ్రహీత దర్శకుడు ఆంగ్ లీ మరియు చిత్రనిర్మాత జాన్ ఎం. చు వంటి ప్రముఖులను కూడా సత్కరించబడతారు.

Also Read :  బ్రాహ్మణ సమాజానికి క్షమాపణలు చెప్పిన డైరెక్టర్

గోల్డ్ హౌస్ గాలా సంస్థ ప్రతి ఏటా 100 మంది ఆసియా, పసిఫిక్ లీడర్లు, యాక్టర్లను ఎంపిక చేస్తోంది. ఆయా రంగాల్లో (సంస్కృతి మరియు వ్యాపారంలో) అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి దీన్ని అందజేస్తుంది. 

2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నారు ప్రియాంకచోప్రా. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలతో తన కెరీర్‌ను స్టార్ట్ చేసి ఓ ఊపు ఊపేసింది. ఇక తన ప్రస్థానం ఇక్కడే ఆగకుండా హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి తన స్టార్ డంను మరింత రెట్టింపు చేసుకుంది. అక్కడ ఓ వైపు నటిస్తూనే సినిమాలు, డాక్యుమెంటరీస్ నిర్మిస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ డైరెక్ట్ తెలుగు సినిమాలో నటిస్తుంది. రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న SSMB 29లో కీలక పాత్ర పోషిస్తుంది.