రిలీజైన గంటల్లోనే యూఎస్‌‌ బెస్ట్ సెల్లర్‌‌ లిస్ట్‌‌లో చేరిన ప్రియాంక బుక్

రిలీజైన గంటల్లోనే యూఎస్‌‌ బెస్ట్ సెల్లర్‌‌ లిస్ట్‌‌లో చేరిన ప్రియాంక బుక్

సినీ తారల జీవితాల గురించి రకరకాల ఆర్టికల్స్‌‌, బుక్స్ రావడం, బయోపిక్స్ రూపొందడం కామన్‌‌. అయితే ఎవరి జీవితం గురించి వారు రాసుకుంటేనే అది సమగ్రంగా ఉంటుంది. వారి జీవితాల్లోని నిజమైన సంఘర్షణ ప్రపంచానికి తెలుస్తుంది. కానీ అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. ప్రియాంక చోప్రా మాత్రం తన అనుభవాలను ‘అన్‌‌ఫినిష్డ్‌‌’ పేరుతో పుస్తక రూపంలోకి తెచ్చింది. శుక్రవారం యూఎస్‌‌లో ఈ బుక్‌‌ విడుదలైంది. తన జీవితంలోని స్ట్రగుల్స్, అచీవ్‌‌మెంట్స్‌‌, ఈ స్థాయికి వచ్చే క్రమంలో ఎదురైన అనుభవాలన్నింటినీ ఈ పుస్తకంలో రాసిందామె. ప్రియాంక కేవలం ఓ నటి మాత్రమే కాదు.. సింగర్‌‌, ప్రొడ్యూసర్‌‌,  ఫిలాంత్రఫిస్ట్, మాజీ మిస్‌‌ వరల్డ్, యునిసెఫ్ అంబాసిడర్‌‌. ఇవి కాక మహిళలు, మానవ హక్కుల విషయంలో యాక్టివ్ స్పీకర్ కూడా. అందుకే రిలీజైన కొన్ని గంటల్లోనే ఈ పుస్తకం యూఎస్‌‌ బెస్ట్ సెల్లర్‌‌ లిస్ట్‌‌లో చేరింది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌‌గా ఉండే ప్రియాంక చోప్రా ఇది నా కథ అంటూ తన హ్యాపీనెస్‌‌ని ఇన్‌‌స్టాగ్రామ్‌‌ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే ఆమె జీవితం ఇంకా ఎంతో ఉంది.  తన కథ ఇంకా ముగియలేదని, అందుకే ఆ టైటిల్‌‌ పెట్టానని చెబుతోంది ప్రియాంక. ఇక ఈ పుస్తకం కవర్‌‌ పేజీపై బ్లాక్‌‌ కలర్ కాస్ట్యూమ్‌లో ఎంతో అందంగా ఉంది ప్రియాంక. తన చేతిపై డాడీస్ లిటిల్ గాళ్‌‌ అనే టాటూ హైలైట్.

For More News..

పాత కారు కొనడానికి రైట్​ టైం ఇదే!

ఫ్లిప్‌ కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’