![చివరిసారి ఓ ఫంక్షన్లో కలిశా : హీరోయిన్ రాధ](https://static.v6velugu.com/uploads/2022/12/Actress-Radha-Emotional-About-Kaikala-Satyanarayana_0l1RyjKv3g.jpg)
కైకాలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని సీనియర్ హీరోయిన్ రాధ తెలిపారు. నటుడు కైకాల సత్యనారాయణకు ఆమె నివాళులర్పించారు. నటి రాధ కైకాల పార్థివదేహానికి పూలమాలలు వేసి చివరి సారి అంజలి ఘటించారు. ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పాలకరించేవారని.. ఆయన ఆత్మకి శాంతిచేకూరాలని కోరుకుంటున్నానని చెప్పారు. కైకాలతో కలిసి 50 సినిమాల్లో నటించానన్నారు. చివరిసారిగా హైదరాబాద్ లో ఒక ఫంక్షన్ లో కలిశాను అని రాధ గుర్తు చేసుకున్నారు.
కైకాల సత్యనారాయణ నిన్న అనారోగ్యంతో మృతి చెందగా.. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. కైకాల పార్థివదేహాన్ని ఫిలింనగర్‌లోని ఆయన ఇంటి నుంచి మహాప్రస్థానంకు అంతిమయాత్రగా తీసుకువచ్చారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు గౌరవ వందనం తర్వాత గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి నివాళులర్పించారు. కైకాల పెద్ద కుమారుడు లక్ష్మీ నారాయణ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.