
కన్నడ నటి రన్యా రావును దుబాయ్ నుంచి రూ.12 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినందుకు మార్చ్ 1న బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు నటి రన్యా రావుపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే ఇటీవలే జరిగిన విచారణలో పోలీసులు పలు విస్తుపోయే నిజాలు కనుగొన్నారు. ఇందులో ముఖ్యంగా రన్యా రావు తాను గోల్డ్ స్మగ్లింగ్ కి పాల్పడటం ఇదే మొదటిసారి అని ఇంతకుముందెన్నడూ ఇలాంటి పనులు చెయ్యలేదని తెలిపింది.
Also Read:-గంజాయి మిక్స్ చేసిన కుల్ఫీ ఐస్క్రీమ్స్, బర్ఫీ స్వీట్స్ తినేశారు..!
అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రన్యా రావు తాను గోల్డ్ స్మగ్లింగ్ ఎలా చేయాలో యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నానని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంతేకాదు ఎయిర్పోర్ట్ లో పోలీసుల చెకింగ్ సమయంలో వాష్ రూమ్ కి వెళ్లాలని చెప్పి, వాష్ రూమ్ లో బంగారం దాచి వచ్చి.. చెకింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ బంగారం అక్కడి నుంచి తరలించడం ఇదంతా సినీ ఫక్కీ స్టైల్ లో ప్లాన్ చేసుకున్నానని చెప్పడంతో ఆశ్చర్యపోయారు.
ఇక తాను గతంలో దుబాయ్ దేశానికి ఫోటో, వీడియో షూట్ల కోసం వెళ్లానని, అలాగే పలు రియల్ స్టేట్ వ్యాపారాల డీలింగ్స్ కూడా పోలీసుల విచారణలో పేర్కొంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ చెయ్యడం వలన వచ్చే డబ్బునే కాదు ఆ తర్వాత పోలీసులకి చిక్కితే కలిగే జైలు శిక్ష ఎంత పడుతుందో కూడా తెలుసుకుని ఉంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడటంతో పోలీసులు ఈ కేసుని మరింత లోతుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో నటి రన్యా రావు వెనుక ఇంకెవరైనా ఉన్నారా..? అసలు ఈ గోల్డ్ సిండికేట్ కి ఉన్న లింకులేమిటనే వివరాల గురించి దర్యాప్తు చేస్తున్నారు.