
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సెలబ్రిటీలకు ఉచ్చుబిగిస్తోంది. టీవీ యాంకర్స్ నుంచి సినిమా హీరోలు, ప్రముఖ నటుల వరకు ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడంతో అందరికీ నోటీసులు జారీ చేశారు పోలీసులు. కొందరు తప్పైంది.. తెలియక చేశామని వీడియోలు రిలీజ్ చేస్తుంటే.. మరి కొందరు చట్ట ప్రకారమే చేశామని ప్రకటిస్తూ సర్దిచెప్పుకేనే ప్రయత్నం చేస్తు్న్నారు. తెలియక చేసినా.. తెలిసి చేసినా తప్పు తప్పే. బెట్టింగ్ యాప్స్ వలన వేల మంది అమాయకులు బలయ్యారని, తప్పకుండా విచారణను ఎదుర్కోవాల్సిందేనని పోలీసులు కరాఖండిగా చెప్పేస్తున్నారు.
ఇప్పటికే ఈ కేసులో యాంకర్, ఆర్టిస్ట్ విష్ణుప్రియ పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరైన విషయం తెలసిందే. తాజాగా గురువారం (మార్చి 20) మరో ఆర్టిస్ట్ రీతూ చౌదరి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు హాజరయ్యింది. ఇప్పటికే స్టేషన్ లో విష్ణుప్రియ ఉండటంతో.. ఇద్దరిని కలిపి పోలీసులు విచారించే అవకాశం ఉంది.
Also Read : చట్ట ప్రకారమే విజయ్ ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేశాడు
అయితే ఈ కేసులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే.. రీతూ చౌదరి ఈ కేసుకు సంబధించి వీడియో రిలీజ్ చేయడం. తనపై కేసు నేమోదైందని తెలిసిన వెంటనే.. సే నో టు బెట్టింగ్ యాప్స్ (say no to betting apps) అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశానని, అవన్నీ గతేడాది చేసినవి అని వీడియో రిలీజ్ చేసింది. బెట్టింగ్ యాప్స్ ను నమ్మకండి.. అంటూ వీడియో చేసింది రీతు చౌదరి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఎందరో అమాయకుల జీవితాలు బెట్టింగ్ యాప్స్ కు బలయ్యాయి. విచారణ ఎదుర్కోక తప్పదు. క్షమాపణ చెబితే తప్పు ఒప్పై పోదుగా అంటున్నారు విశ్లేషకులు. పోలీసులు కూడా ఈ కేసులో చాలా సీరియస్ గా ఉన్నారు.