Anshu Malika: నటి రోజా కూతురికి గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు... గ్రేట్ అంటున్న నెటిజన్లు..

Anshu Malika: నటి రోజా కూతురికి గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు... గ్రేట్ అంటున్న నెటిజన్లు..

Actress Roja Daughter Anshu Malika: ఏపీ మాజీ మంత్రి, వెటరన్ హీరోయిన్ రోజా సెల్వమణి కూతురు అన్షు మాలిక తన తల్లిబాటలోనే దూసుకుపోతోంది. ఈ క్రమంలో అన్షు మాలికకు సోషల్ ఇంపాక్ట్ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు లభించింది. ఇటీవల నైజీరియాలోని లాగోస్‌లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్‌లో అన్షు మాలిక ఈ అవార్డును అందుకుంది. ఈ విషయాన్ని నటి రోజా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఇందులోభాగంగా "సోషల్ ఇంపాక్ట్ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు అందుకున్న అన్షు మాలికకి అభినందనలు. మా కృషి పట్టుదల ఫలించాయి" అంటూ కూతురిని ప్రశంసిస్తూ "ఎక్స్" లో ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్లు అన్షు మాలికకి అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే అన్షు మాలిక తల్లికి దగ్గ కూతురు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Also Read : రిస్క్ చేసిన బాలీవుడ్ హీరో

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అన్షు విదేశాలలో చదువుకుంటోంది. దీంతో ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క సాఫ్ట్వేర్ రంగంలో కీలక మార్పులు తెస్తున్న ఏఐ విభాగంలో కోడింగ్, డెవలప్మెంట్ వంటి విభాగాల్లో పనిచేస్తోంది. అయితే 7 ఏళ్ళ వయసులోనే కోడింగ్ రాయడం ప్రారంభించిన అన్షు, 17 సంవత్సరాల వయస్సులో ‘ఫేస్ రికగ్నిషన్ బాట్ యూజింగ్ డీప్ లెర్నింగ్’ అనే అంశంపై రిసెర్చ్ ఆర్టికల్ రాసింది. ఈ ఆర్టికల్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్‌లో కూడా ప్రచురించబడింది.