World Wildlife Day: వన్యప్రాణులు మానవులకు నేర్పించే పాఠాలపై హీరోయిన్ సదా పోస్ట్.. వీడియో వైరల్

World Wildlife Day: వన్యప్రాణులు మానవులకు నేర్పించే పాఠాలపై హీరోయిన్ సదా పోస్ట్.. వీడియో వైరల్

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన సదా(Sadaa).. ఇపుడు వన్యప్రాణి ఫోటోగ్రాఫర్‌గా మారారు. తనలోని మరోకొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ పలు బ్యూటిఫుల్ ఫొటోస్ను తన కెమెరాలో బంధించారు. లేటెస్ట్గా హీరోయిన్ సదా తన ఇంస్టాగ్రామ్లో ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ను షేర్ చేసింది. 

నేడు (మార్చి 3న) ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (World Wildlife Day) సందర్బంగా సదా ఓ అర్ధవంతమైన వీడియో పోస్ట్ చేసింది. 'వన్యప్రాణులు ప్రయత్నించకుండానే మనకు విలువైన పాఠాలు నేర్పుతాయని, అంతర్దృష్టులను అందించే మార్గాన్ని కలిగి ఉండేలా చేస్తాయని' పురివిప్పే ఓ నెమలి వీడియో ద్వారా తెలిపింది.

సదా ఓ నెమలి ప్రేమాయణాన్ని పోస్ట్ చేస్తూ.. వన్యప్రాణులు మానవులకు నేర్పించే పాఠాలపై సుదీర్ఘమైన పోస్ట్ రాసింది. ఈ సహజ ప్రపంచం స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలతో నిండి ఉందని తెలిపింది.

"నెమళ్ళు నెమళ్లను ఎలా ప్రేమిస్తాయో వివరంగా వివరించింది. "గంభీరమైన నెమళ్ళు తమ ప్రేమను గెలుచుకోవడానికి రోజుల తరబడి నృత్యం చేస్తాయి. సొంత నిర్ణయంతో తమ అందమైన ప్రదర్శనలో నియంత్రణను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఒక నెమలి నిజంగా ఆకట్టుకుని తాను ప్రేమించే మరో నెమలి యొక్క సమ్మతిని ఇచ్చే వరకు, సంభోగం జరగదు" అని ఆమె వీడియో ద్వారా వివరంగా చెప్పుకొచ్చింది.

'ఈ అందమైన పక్షి జంతు రాజ్యంలో సరిహద్దులు మరియు కోరికలను గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయలేదా?' అనే ప్రశ్నను లేవనెత్తుతూ ఆమె తన పోస్ట్‌ను ముగించింది. అయితే, ఈ వీడియో నిజానికి తన గతంలో పోస్ట్ చేసిన వీడియో అని తెలిపింది.

అయితే, ప్రస్తుత సమాజంలో అనేక చోట్ల ఆడపిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలను  వివరించే విధంగా ఈ పోస్ట్ ఉంది. జాలి, దయ, చిన్న, పెద్ద, ముసలి ముతక అనే తేడా లేకుండా రెచ్చిపోతున్న కామాంధులను ఉద్దేశిస్తూ చేసిన ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

ప్రకృతి ఇచ్చిన అద్భుత ఉదాహారణలతో కళ్ళు తెరిపించడానికి ప్రయత్నించినా మీ ప్రయత్నం బాగుందంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.