
భారత ప్రముఖ క్రికెటర్ చాహల్ తన భార్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విడాకుల అనంతరం చాహల్ తన మాజీ భార్య ధనశ్రీ వర్మకి దాదాపుగా రూ.50 కోట్లు భరణం ఇచ్చాడని పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ భరణం వ్యవహారం చివరికి ధనశ్రీ వర్మ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టెవరకూ వెళ్ళింది. దీంతో ధనశ్రీ వర్మ తండ్రి ఏకంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తమ కూతురు చాహల్ నుంచి భారీగా భరణం అందుకున్నట్లు వినిపిస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు.
అయితే ఇప్పుడు తెలుగు హీరోయిన్ సమంత విడాకులు, భరణం మేటర్ మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటి సమంత తన మాజీ భర్త, స్థార్ హీరో నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నప్పుడు రూ.200 కోట్లు భరణం వదులుకుందట. ఇందులో భాగంగా విడాకుల సమయంలో సమంతకి అక్కేనేని కుటుంబ సభ్యులు రూ.కోట్లు విలువ చేసే ఇల్లు, ఖరీదైన బంగారు ఆభరణాలు, షేర్లు. ఇలా దాదాపుగా రూ.200 కోట్లు పై చిలుకు విలువ చేసే ఆస్తులను ఆఫర్ చేసినప్పటికీ సమంత మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
Also Read : ఎల్ 2 ఎంపురాన్ రివ్యూ.. మోహన్ లాల్ పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
ఇక బాలీవుడ్ లో ఇప్పటి వరకూ అంత్యంత ఖరీదైన విడాకుల లిస్టులో స్టార్ హీరో హృతిక్ రోషన్ తన మాజీ భార్య సుసాన్నె ఖాన్ జంట ఉన్నారు. అయితే హృతిక్ రోషన్ సుసాన్నె ఖాన్ 2000వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2014లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. విడాకుల సమయంలో హృతిక్ రోషన్ తన భార్య సుసాన్నె ఖాన్ కి భరణంగా దాదాపుగా రూ.380 కోట్లు చెల్లించాడట.. అంతేకాదు వీరికి జన్మించిన హ్రేహాన్ రోషన్, హృదాన్ రోషన్ సంరక్షణ బాధ్యతలు కూడా హృతిక్ రోషన్ చూసుకుంటున్నట్లు సమాచారం.
మరో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా విడాకుల సమయంలో తన మొదటి భార్య రీనా దత్త కి రూ.50 కోట్లు, రెండో భార్య కిరణ్ రావుకి రూ.15 కోట్లు ఇచ్చాడు. దేవర మూవీ ఫేమ్ సైఫ్ అలీ ఖాన్ తన మాజీ భార్య అమృత సింగ్ కి విడాక్యుల సమయంలో దాదాపుగా రూ.2.5 కోట్లు భరణంతోపాటూ తన కొడుకు సంరక్షణ చూసుకుంటున్నందుకుగానూ అతడికి 18 ఏళ్ళు వచ్చేంతవరకూ నెలకి రూ.లక్ష ఇస్తున్నట్లు ఆమధ్య ఓ మీడియాతో చెప్పుకొచ్చాడు.