Samantha: ఆ సమయంలో వారందరూ నాకు సపోర్ట్ చేశారు: సమంత

Samantha: ఆ సమయంలో వారందరూ నాకు సపోర్ట్ చేశారు: సమంత

తెలుగు ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత హిందీలో రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన సిటాడెల్: హానీ బన్నీ అనే వెబ్ సీరీస్ లో లీడ్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సీరీస్ లో బాలీవుడ్ ప్రముఖ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించగా స్పై థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. అయితే ఈ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే తనపై ఓ ప్రముఖ పొలిటీషన్ చేసిన వ్యాఖ్యలు చేసిన సమయంలో సినిమా ఇండస్ట్రీ స్పందించిన తీరుపై స్పందించింది. 

ఇందులో భాగంగా ఈ సంఘటన జరిగినప్పుడు సినిమా ఇండస్ట్రీ తనకి ఎంతగానో అండగా నిలిచిందని తెలిపింది. ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ధైర్యాన్ని ఇచ్చింది..  ఇండస్ట్రీ, మీడియా, అభిమానులు చూపించిన ప్రేమే ఈ వివాదం నుంచి తాను ఈ సంఘటన నుంచి త్వరగా కోలుకుని బయటకు వచ్చేలా చేసిందని, లేకుంటే మరింతగా కుంగిపోయేదానినని చెప్పుకొచ్చింది. అందరి సపోర్ట్ వల్లే తిరిగి ఈరోజు మీ ముందు కూర్చున్నానని అలాగే ఇలాంటి కష్ట సమయాల్లో తనకి సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.

ALSO READ | హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తెలుగు హీరోయిన్.. ఏమైందంటే..?

అయితే సమంత సనఘటన జరిగిన సమయంలో టాలీవుడ్ ప్రముఖ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అక్కనేని నాగ చైతన్య తదితర స్టార్ హీరోలు స్పందించి నటి సమంత కి మద్దతుగా నిలిచారు.

ఈ విషయం ఇలా ఉండగా 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సీరీస్ లో సమంత మరియు వరుణ్ ధావన్ స్పై ఏజెంట్స్ హనీ బన్నీ పాత్రల్లో నటించారు. 
ఇటీవలే సిటాడెల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సిటాడెల్ లో యాక్షన్ క్వీన్ గా కనిపించింది. అయితే యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ ట్రైలర్ ఆడియన్స్ ని బాగానే అలరిస్తోంది. కాగా ఈ వెబ్ సీరీస్ నవంబర్ 9వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్రైమ్ వీడియొస్ లో ప్రసారం కానుంది.