
హీరోయిన్ సంయుక్త మీనన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేడు (2025 మార్చి 14న) సంయుక్త దయం నైవేద్య విరామం సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసారు.
ఈ సందర్భంగా సంయుక్త మీనన్ రాకను గమనించిన సినీ ఫ్యాన్స్ ఆమెతో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించారు. ప్రస్తుతం సంయుక్త తిరుమల ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సంయుక్త మీనన్ కొత్త సినిమాలు:
సంయుక్త మీనన్ వరుస తెలుగు సినిమాల్లో నటిస్తోంది. అందులో ముఖ్యంగా బాలకృష్ణ ‘అఖండ’ సీక్వెల్ లో హీరోయిన్‌గా సంయుక్త సెలెక్ట్ అయింది. ఇటీవలే, అఖండ2లో సంయుక్త కీలకపాత్రను పోషించబోతోందని మేకర్స్ తెలియజేశారు.
Also Read:-పోయాం మోసం : కాజల్ వస్తుందంటూ హోలీ టికెట్లు..
అలాగే, నిఖిల్‌తో స్వయంభు, శర్వానంద్‌తో నారీ నారీ నడుమ మురారీ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ చిత్రంతో పాటు మరో మూడు ప్రాజెక్ట్స్‌తో ఆమె బిజీగా ఉంది. ఇక ‘అఖండ 2’ మూవీ దసరా సందర్భంగా (2025 సెప్టెంబర్ 25న) పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానుంది.