సీనియర్ నటి శోభన(Shobana) ఇంట చోరీ జరిగింది. చెన్నైలోని తేనాంపేట శ్రీనివాస రోడ్డులో తన తల్లితో కలిసి ఆమె నివసిస్తున్నారు. ఏడాది క్రితం విజయ అనే మహిళ వీరి ఇంట్లో పనిమనిషిగా చేరింది. కొంతకాలంగా ఇంట్లో డబ్బు మాయం అవుతుండటంతో శోభన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పనిమనిషిని నిందితురాలిగా గుర్తించారు.. మార్చ్ నెల నుంచి దాదాపు రూ. 40 వేల వరకు చోరీ చేసినట్టు ఆమె పోలీసులకు తెలిపింది. తనను విడిచిపెట్టాలని ప్రాధేయపడింది. శోభన డ్రైవర్ సహాయంతో పనిమనిషి తన కూతురి ఖాతాకు డబ్బులు పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ...
ఆ మహిళ దీన స్థితికి చెలించిపోయిన శోభన ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు. ఆమెను తిరిగి పనిలో చేర్చుకున్నారు. దీనిపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.