పెళ్లైన ఏడాదికే నటి శోభిత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది..? ఆమె భర్త సుధీర్ రెడ్డి ఎవరు..?

పెళ్లైన ఏడాదికే నటి శోభిత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది..? ఆమె భర్త సుధీర్ రెడ్డి ఎవరు..?

కన్నడ సీరియల్​నటి శోభిత శివన్న ఆత్మహత్య సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. యాక్టింగ్‎కు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకున్న ఏడాదికే శోభిత సూసైడ్ చేసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. చిన్న వయస్సులోనే నటి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది..? భర్తతో విభేదాలా..? కుటుంబ కలహాలా..? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై సినీ సర్కిల్స్‎లో జోరుగా చర్చ జరుగుతోంది. శోభితా మృతితో అసలు ఆమె భర్త ఎవరు అనే దానిపైన పలువురు ఆరా తీస్తున్నారు..

పెళ్లయిన ఏడాదికే.. 

కర్నాటకలోని హసన్ జిల్లా సక్లేశ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన శోభిత(32) కన్నడలో పాపులర్ సీరియల్స్‌‌‌‌‌‌‌‌తో పాటు ​పలు సినిమాల్లో నటించింది.పెండ్లి తర్వాత యాక్టింగ్‌‌‌‌‌‌‌‌కు గుడ్ బై చెప్పిన శోభిత.. కొండాపూర్ శ్రీరాంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన భర్తతో కలిసి ఉంటోంది. హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ జాబ్ చేస్తున్నాడు. ఓ మ్యాట్రిమోనీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో శోభితతో సుధీర్ రెడ్డికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి 2023 మే 21న వారు పెండ్లి చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వచ్చి కొండాపూర్ శ్రీరాంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటున్నారు. సుధీర్ రెడ్డి హైటెక్ సిటీలో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ జాబ్​చేస్తున్నాడు. ఇటీవల తెలుగు సీరియల్స్‌‌‌‌‌‌‌‌తో పాటు సినిమాల్లో అవకాశాల కోసం శోభిత ప్రయత్నాలు చేస్తోంది. 

శనివారం రాత్రి 10 గంటల సమయంలో భర్తతో కలిసి భోజనం చేసిన శోభిత.. తన బెడ్ రూంలోకి వెళ్లి నిద్రపోయింది. మరో బెడ్‌‌‌‌‌‌‌‌ రూంలో సుధీర్​రెడ్డి తన ఆఫీస్‌‌‌‌‌‌‌‌ వర్క్ చేసుకుంటూ అందులోనే నిద్రపోయాడు. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో పనిమనిషి వచ్చి శోభిత బెడ్ రూం డోర్​కొట్టగా, ఆమె ఓపెన్​ చేయలేదు. దీంతో సుధీర్ రెడ్డి డోర్ పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా, శోభిత ఫ్యాన్‌‌‌‌‌‌‌‌కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శోభిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు.