Sneha: హీరోయిన్ స్నేహ కి అలాంటి ప్రాబ్లమ్ ఉందంట.. అందుకే అన్నింటిని అలా చేస్తూ..

Sneha: హీరోయిన్ స్నేహ కి అలాంటి ప్రాబ్లమ్ ఉందంట.. అందుకే అన్నింటిని అలా చేస్తూ..

Sneha: టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా నటించి తెలుగు ఆడియన్స్ కి బాగానే దగ్గరైంది తమిళ్ హీరోయిన్ స్నేహ.. అయితే నటి స్నేహ  ఓవర్ ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉంటూ చక్కని కట్టు బొట్టుతో మంచి హోమ్లీ పాత్రల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది. నటి స్నేహ 2012లో తమిళ్ నటుడు ప్రసన్న కుమార్ ని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. తమిళనాడులోని చెన్నైలో నివాసముంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.

ALSO READ | Samyuktha Menon: శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్.. ఫోటోలు వైరల్

అయితే ఇటీవలే నటి స్నేహ తన భర్త ప్రసన్న కుమార్ తో కలసి ఓ ఇంటర్వూలో పాల్గొంది.. ఇందులో భాగంగా ప్రసన్న కుమార్ తన భార్య గురించి పలు ఆసక్తికర విషయాల్ని ఆడియన్స్ తో పంచుకున్నాడు. ఈ క్రమంలో స్నేహ కి OCD (Obsessive–compulsive disorder) సమస్య ఉందని దీంతో తన చుట్టుప్రక్కల శుభ్రంగా లేకపోతే అస్సలు సహించదని తెలిపాడు.. దీంతో ఇంట్లో కూడా వస్తువులు క్లీన్ గా లేకపోయినా.. కిచెన్ క్లీన్ గా లేకపోయినా తిట్లు తప్పవని చెప్పుకొచ్చాడు. అయితే ఈ OCD కారణంగా ఇప్పటికే 3సార్లు ఇళ్లు మారామని తన లైఫ్ లో మార్చనిది ఏదైనా ఉందంటే అది తానే అని సరదాగా చెబుతూ నవ్వించాడు..  దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి.

అయితే నటి స్నేహ ఈ ఏడాది లవ్ టుడే ఫేమ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన "రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్" అనే సినిమాలో డాక్టర్ పాత్రలో నటించింది.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. ఇక నటుడు ప్రసన్న కుమార్ కూడా అడపాదడప సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నాడు.