
టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య గత ఏడాది చివరిలో తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అయితే నటి శోభిత తెలుగు రాష్టాలకి చెందిన నటి అయినప్పటికీ మొదటగా కెరీర్ బాలీవుడ్ లో స్టార్ట్ చేసింది. అంతేకాదు సినిమాల్లోకి రాకముందు కొంతకాలంపాటూ మోడలింగ్ రంగంలో కూడా పని చేసింది. ఈ క్రమంలో 2013లో మిస్ ఇండియా ఫెమినా బ్యూటీ కాంపిటీషన్ లో కంటెస్టెంట్ గా విన్నర్ గా నిలిచింది. అదే ఏడాది మిస్ ముంబై కిరీటాన్ని కూడా దక్కించుకుంది..
అయితే గతంలో నటి శోభిత ఓ ఇంటర్వూలో తన చిన్నప్పటి లవ్ స్టోరీ గురించి చూపిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. నటి శోభిత తాను స్కూల్ లో చదువుకునే రోజుల్లో తనతో పాటూ చదువుతున్న విద్యార్థితో ప్రేమలో పడిందని కానీ అది వన్ సైడ్ లవ్ స్టోరీ అని తెలిపింది. అయితే తన బాయ్ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చేసేందుకు ఏకంగా స్టంట్లు కూడా చేసేదానినని ఈ క్రమంలో తనకు ఇష్టం లేకున్నా వ్యాస రచనల పోటీలలో పాల్గొన్నానని, చివరికి ఇంతా చేస్తే తన లవ్ ని యాక్సెప్ట్ లేదని చెప్పుకొచ్చింది. అయితే ఇపుడు ఇప్పుడు తన చిన్ననాటి బాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కూడా తెలియదని సరదాగా నవ్వించింది. అయితే ఈ కేయూత్ లవ్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ విషయం ఇలా ఉండగా నటి శోభిత ఇటీవలే ప్రముఖ లేడీ డైరెక్టర్ వందన కఠారి దర్శకత్వం వహించిన లవ్, సితార అనే లవ్ & ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాతో ఆడియన్స్ ముందుకి వచ్చింది.. ఈ సినిమా నేరుగా జీ5 ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అయితే నటి శోభితకి అందం, అభినయం, టాలెంట్ ఉన్నప్పటికీ సరైన స్టోరీ పడకపోవడంతో కెరీర్ పరంగా సరైన బ్రేక్ రాలేదు.. ఇప్పటివరకూ శోభిత పొన్నియన్ సెల్వన్-1, 2, మేజర్, గూఢచారి తదితర సినిమాల్లో నటించింది. అంతేకాదు నైట్ మేనేజర్ అనే వెబ్ సీరీస్ లో కూడా నటించింది.. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది..