
హీరోయిన్ సౌందర్యది హత్య అని, ఆమెతో మోహన్ బాబుకు భూ వివాదాలు ఉన్నాయని ఖమ్మంకు చెందిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ వివాదంపై దివంగత సౌందర్య భర్త రఘు స్పందించాడు. మోహన్ బాబుతో తమకు ఎలాంటి భూ వివాదాలు లేవని స్ప్రష్టం చేశాడు. ఈ మేరకు సౌందర్య భర్త రఘు ఓ లేఖను విడుదల చేశాడు.
హైదరాబాద్‌లోని ఆస్తి విషయమై కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని లేఖలో పేర్కొన్నాడు. తన భార్య సౌందర్య నుంచి మోహన్ బాబు అక్రమంగా పొందిన ఆస్తి ఏదీ లేదని రఘు తేల్చి చెప్పారు.
సౌందర్య మరణించాక ముందు, ఆ తర్వాత కూడా తమ మధ్య మంచి సంబంధం ఉందని క్లారిటీ ఇచ్చాడు. ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలు పబ్లిష్ చేయెుద్దని కోరుకుంటున్నట్లు రఘు విజ్ఞప్తి చేశారు.
Also Read:-హీరోయిన్ సౌందర్యది హత్యనా..? 22 ఏళ్ల తర్వాత ఖమ్మం పీఎస్ లో ఫిర్యాదు
ఇకపోతే, మోహన్ బాబు, సౌందర్య కలిసి పలు తెలుగు సినిమాలలో నటించారు. అందులో పెదరాయుడు, శ్రీరాములయ్య, అధిపతి, పోస్ట్ మాన్, శివ శంకర్ వంటి సినిమాల్లో కలిసి నటించారు. సౌందర్య చివరి సినిమా శివ శంకర్ కూడా మోహన్ బాబుతో కలిసి నటించినదే. ఈ మూవీ షూటింగ్ ఎండింగ్ లో ఉన్నప్పుడే ఆమె మరణించింది.
సౌందర్య మరియు ఆమె సోదరుడు తెలంగాణకు చెందిన ఒక పార్టీ తరపున ప్రచారం చేయడానికి బెంగళూరు నుండి ప్రయాణిస్తుండగా, హెలికాప్టర్ ప్రమాదంలో (ఏప్రిల్ 17, 2004న) ప్రాణాలు కోల్పోయారు.
అసలేం జరిగింది:
మంచు మోహన్ బాబుపై ఖమ్మ జిల్లాకు చెందిన ఓ సామజిక కార్యకర్త పోలీసులుకు కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం మోహన్ బాబు నివసిస్తున్న జల్ పల్లి గెస్ట్ హౌస్ కోసం దివంగత నటి సౌందర్యను హత్య చేయించారని పోలీసులతో పాటు ఖమ్మం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశాడు. శంషాబాద్‌లోని జల్లేపల్లిలో ఆరు ఎకరాల గెస్ట్ హౌస్‌ను అమ్మమని నటి సౌందర్యను మోహన్ బాబు కోరారని, దానికి ఆమె సోదరుడు అమర్‌నాథ్ నిరాకరించారని కార్యకర్త తన లేఖలో పేర్కొన్నారు.