
టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) తమిళనాడులోని ప్రముఖ ఆలయాన్ని సందర్శించారు. చిదంబరంలోని తిళ్లై నటరాజ స్వామి (Thillai Nataraja Temple) గుడికి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకుంది. అనంతరం అక్కడ ప్రత్యేక పూజల్లో శ్రీలీల పాల్గొంది.
ప్రస్తుతం శ్రీలీల తన ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో శ్రీలీల ఆలయ పూజారుల నుండి ఆశీర్వాదం పొందుతున్నట్లు కనిపించింది. ఈ ఫొటోల్లో శ్రీలీల సాంప్రదాయ ఎరుపు మరియు పసుపు చీరలో చాలా పద్దతిగా కనిపిస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటోంది.
Sreeleela at thillai nataraja temple, Tamilnadu#Sreeleela @sreeleela14 #Parasakthi pic.twitter.com/7lRPy7CBAi
— Team Sreeleela™️ (@Teamsreeleela) February 11, 2025
ప్రస్తుతం శ్రీలీల వరుస ప్రాజెక్ట్స్తో దూసుకెళ్తోంది. తెలుగు, తమిళ సినిమాల్లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ సక్సెస్ ఫుల్గా రాణిస్తుంది. శివకార్తికేయన్ లేటెస్ట్ పరాశక్తి మూవీతో తమిళ్ కి ఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే ఈ మూవీ నుండి టీజర్ రిలీజ్ చేశారు.
అంతేకాకుండా శ్రీలీల త్వరలో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుంది. సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ డెబ్యూ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. అలాగే కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాలో కూడా సెలెక్ట్ అయినట్లు సమాచారం.
అయితే, శ్రీలీల తెలుగులో నితిన్తో నటించిన రాబిన్ హుడ్ రిలీజ్కి సిద్ధంగా ఉంది. మార్చి 28న థియేటర్లలలో రానుంది. దాంతో పాటు పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్‌సింగ్, రవితేజ మాస్ జాతర, శివ కార్తికేయన్ పరాశక్తి సినిమాలున్నాయి లైన్లో ఉన్నాయి.