టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం (ఫిబ్రవరి 19న) తిరుమల చేరుకున్న ఆమెకు టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వీఐపీ ప్రారంభ బ్రేక్ దర్శనం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంది.
శ్రీలీల దర్శనానంతరం..రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆమెకు వేదాశీర్వచనలతో శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. సంప్రదాయ లంగాఓణీలో కనిపించిన శ్రీలీలను చూసిన అభిమానులు ఆలయం బయట సెల్ఫీల కోసం ఎగబడ్డారు.
శ్రీలీల మీడియాతో, ఫ్యాన్స్తో మాట్లాడుతూ..'నన్ను ప్రసాదం తెమ్మన్నారు..ఇంతమందిలో ఎవరికి ఇవ్వాలండి! అన్నారు శ్రీలీల. అలాగే పెళ్లి సందడి సినిమా టైములో తిరుమలకి వచ్చానని..ఇక ఆ తర్వాత ఇపుడే రావడమని' తెలిపింది. శ్రీలీల ఆదివారం రాత్రి (ఫిబ్రవరి 18న) తిరుమలకు చేరుకొని అక్కడే బస చేసినట్లు సమాచారం.
ఇక శ్రీలీల సినిమాల విషయానికి వస్తే..ధమాకా తర్వాత శ్రీలీలకి సరైన సక్సెస్ పడలేదు. భగవంత్ కేసరి భారీ హిట్ అయినా ఆ క్రెడిట్ అంతా బాలయ్య ఖాతాలోకే పోయింది. ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలు వరుసగా పరాజయం చెందాయి. దీంతో శ్రీలీల రేసులో కాస్త వెనుకబడిందనే చెప్పాలి.
లేటెస్ట్ గుంటూరు కారంతో అమ్మడు అన్ని లెక్కలు సరి చేసిన్నట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్, నవీన్ పోలిశెట్టితో అనగనగ ఒకరాజు, రవితేజతో ఒక సినిమా, విజయ్ దేవరకొండతో మరో సినిమాలో నటిస్తుంది.