హీరోయిన్ తో కనిపించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. ఆడవాళ్ళని అడ్డుపెట్టుకుని రాజకీయాలేంటంటూ..

హీరోయిన్ తో కనిపించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే..  ఆడవాళ్ళని అడ్డుపెట్టుకుని రాజకీయాలేంటంటూ..

ఈమధ్య సోషల్ మీడియా వినివియోగం పెరగడంతో వీడియో, ఫోటోలు, వార్తలు,  ఇలా ఎలాంటి కంటెంట్ అయినా ఈజీగా వైరల్ అయిపోతోంది. ముఖ్యంగా కొందరు వ్యూస్, రీచ్ వంటి కోసం మానవ సంబంధాలని కూడా వక్రీకరిస్తూ ప్రచారాలు చేస్తున్నారు. అయితే ఇటీవలే అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఓ అమ్మాయితో మాట్లాడుతూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

అయితే ఈ వీడియోలో ఉన్న అమ్మాయితో ప్రకాష్ రెడ్డి కొంతమేర చనువుతో ఆమె భుజంపై చెయ్యి వేసి మాట్లాడుతూ కనిపించాడు. దీంతో కొందరు వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వీటిపై ఈ ఇద్దరూ సైలెంట్ గా ఉండేసరికి ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. 

దీంతో సోషల్ మీడియా వేదికగా నటి సమయ రెడ్డి స్పందించింది. ఇందులోభాగంగా ప్రకాష్ రెడ్డితో కలసి మాట్లాడుతున్నది తానే అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక తప్పుడు ప్రచారాల గురించి మాట్లాడుతూ ప్రకాష్ రెడ్డి మాకు చుట్టరికం ఉందని, ఫెస్టివల్స్, అకేషన్స్ కి తరచుగా మేము వాళ్ళ ఇంటికి వెళ్లడం, వాళ్ళు మా ఇంటికి రావడం కామన్ గా జరుగుతుంటాయని చెప్పుకొచ్చింది. చనువుతో మాట్లాడినంత మాత్రాన వారిద్దరిమధ్య ఎదో ఉందంటూ ప్రచారాలు చెయ్యడం సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చెయ్యొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక నుంచైనా తన గురించి ఈ తప్పుడు ప్రచారాలు చెయ్యడం ఆపాలని కోరింది.

Also Read:-పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడుకు ప్రమాదం.. 

ఈ విషయం ఇలా ఉండగా నటి సమయ రెడ్డి "డియర్ ఉమ" అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. స్టోరీ కూడా సమయ రెడ్డి అందించింది. సోమవారం (ఏప్రిల్ 7)టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ అయ్యింది. ఏప్రిల్ 18న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.