Sunny Leone: పింఛన్ స్కామ్ పై స్పందించిన సన్నీ లియోన్.. పోలీసుల విచారణకి సహకరిస్తా..

Sunny Leone: పింఛన్ స్కామ్ పై స్పందించిన సన్నీ లియోన్.. పోలీసుల విచారణకి సహకరిస్తా..

Sunny Leone: ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరు మీదుగా పింఛన్ అందుకుంటున్న ఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నటి సన్నీ లియోన్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 

ఇందులోభాగంగా "ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మోసం సంఘటన గురించి తెలుసుకోవడం దురదృష్టకరం, ఇక్కడ నా ఐడెంటిటీ తప్పుగా ఉపయోగించబడింది. మహిళల సాధికారత మరియు ప్రయోజనం కోసం రూపొందించిన పథకాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడం మరియు తప్పుగా చూపించడం బాధాకరం .అలాగే ఈ కేసు దర్యాప్తులో అధికారులకు మద్దతు ఇస్తానని" పేర్కొంది. 

దీంతో పోలీసులు ఈ విషయం గురించి స్పందిస్తూ డిజిటల్ యుగంలో ఆర్థిక నేరాలకి స్కోప్ ఎక్కువగా ఉంటుందని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రజలకి సూచించారు. అలాగే గుర్తు తెలియని ఫోన్ నంబర్స్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఆన్సర్ చెయ్యద్దని, ఇలా చెయ్యడం వలన డేటా చోరీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కాబట్టి ఆన్సర్ చెయ్యకపోవడమే మంచిదని అంటున్నారు. ఇక ఓటీపీ, ఇతర పాస్వర్డ్స్ గుర్తు తెలియనివ్యక్తులకి షేర్ చెయ్యద్దని హెచ్చరించారు.

ALSO READ | మళ్లీ ఎప్పుడు పిలిస్తే అపుడు విచారణకు రావాలె.. పీఎస్ నుంచి ఇంటికెళ్లిన అల్లు అర్జున్

ఈ విషయం ఇలా ఉండగా ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ రీజియన్ తాలూర్ గ్రామానికి చెందిన  వీరేంద్ర జోషి అనే వ్యక్తి సినీనటి సన్నిలియోన్ పేరుతో నకిలీ డాక్యుమెట్స్ సృష్టించి ప్రభుత్వం వివాహిత మహిళల కోసం ‘మహతారి వందన యోజన’ స్కీమ్‎ ద్వారా నెల నెలా రూ.1000 అందుకుంటున్నాడు. దీంతో ఇటీవలే జరిగిన సర్వేలో ఈ విషయం బయటపడింది.