
టాలీవుడ్ లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తోపాటూ సినీ సెలెబ్రెటీలపై పలు సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు.. ఈ కేసులు నమోదు చేసినవారి లిస్టులో ప్రముఖ నటి సురేఖావాణి కూతురు సుప్రీత కూడా ఉంది. అయితే అరెస్టుల విషయం కలకలం రేపడంతో సుప్రీత గురించి కొందరు సోషల్ మీడియాలో పలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు.. దీంతో ఈ విషయంపై సుప్రీత సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
ఇండియాలో భాగంగా ఓ వీడియో ని రిలీజ్ చేసింది.. ఈ వీడియోలో తాను క్షేమంగా ఉన్నానని, సోషల్ మీడియాలో, టీవీ ఛానెల్స్ లో తన గురించి వినిపిస్తున్న వార్తలు అబద్ధాలని తెలిపింది. అలాగే ఆ తప్పుడు వార్తల్ని నమ్మవద్దని కోరింది. ప్రస్తుతం తాను ఓ ఈవెంట్ షూటింగ్ లో ఉన్నానని తెలిపింది. ఈ క్రిటికల్ సిచువేషన్ లో నన్ను సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికి థాంక్స్ అంటూ పేర్కొంది.
ALSO READ | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి ఈడీ..!
ఈ విషయం ఇలా ఉండగా ఏ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై సుప్రీత తల్లి సురేఖ వాణి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాల్ని తెలిపింది.. సుప్రీత బెట్టింగ్ యాప్స్ గురించి తెలియక ప్రమోట్ చేసిందని చెప్పుకొచ్చింది.. అలాగే తన కూతరు సుప్రీత నేరుగా బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చెయ్యలేదని కేవలం ఇతరులు షేర్ చేసిన లింకులని సోషల్ మీడియాలో రీ ట్వీట్, రీ పోస్ట్ చేసిందని అంతేతప్ప ఎలాంటి పాపం ఎరగదని చెప్పుకొచ్చింది.
కానీ సుప్రీత మాత్రం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశానని అందుకు సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో తాను గతంలో తెలియక బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి తప్పు చేశానని, ఎవరూ కూడా ఈజీమనీ కోసం అలవాటు పది బెట్టింగ్ ని ఎంకరేజ్ చెయ్యద్దని కోరింది. అలాగే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని అన్ ఫాలో చెయ్యాలని సూచించింది.
thanks for all your support ❤️ pic.twitter.com/b55xZpgUW1
— Bandaru Sheshayani Supritha (@_supritha_9) March 17, 2025