
తెలుగులో ప్రముఖ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో వచ్చిన కొత్త బంగారు లోకం సినిమాతో యంగ్ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపొయింది. కాలేజ్ లైఫ్, లవ్ లైఫ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని కలగలిపి తీసిన ఈ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ముఖంగా ప్రకాష్ రాజ్, జయసుధ, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం ఇలా అందరూ తమ పాత్రలతో కట్టి పడేశారు. అయితే ఈ సినిమాలో నటించిన తర్వాత నటి శ్వేతా బసు ప్రసాద్ కొన్ని సంఘటనల కారణంగా తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వెబ్ సీరీస్లు, సినిమాలు అంటూ బాగానే రాణిస్తోంది.
Also Read :- 365 రోజులుగా టాప్ 10లో సలార్
అయితే ఇటీవలే శ్వేతా బసు ప్రసాద్ ఓ ఇంటర్వూలో తెలుగు సినిమా షూటింగ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని గుర్తు చేసుకుంది. ఇందులోభాగంగా తాను తన పక్కన నటిస్తున్న హీరో కంటే తక్కువ ఎత్తు ఉండటంతో పొట్టి అంటూ షూటింగ్ సెట్స్ లో హేళన చేసేవారని తెలిపింది. అయితే తనకి తెలుగు సరిగ్గా మాట్లాడటం రాకపోయేసరికి ఏమీ మాట్లాడకుండా కామ్ గా ఉండేదానినని తెలిపింది. అయితే తన ఎత్తు గురించి చేసిన కామెంట్స్ కారణంగా... షూటింగ్ సమయంలో ఎక్కువ టేక్స్ తీసుకునేదానినని వాపోయింది. దీంతో నటి శ్వేతా బసు ప్రసాద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ విషయం ఇలా ఉండగా నటి శ్వేతా బసు ప్రసాద్ గత ఏడాది త్రిభువన్ మిశ్రా: CA టాపర్, జిందగీనామా తదితర వెబ్ సీరీస్లలో నటించింది. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.