Trisha: హాట్ టాపిక్ గా మారిన త్రిష ఉంగరం.. ఎంగేజ్మెంట్ అయిపోయిదా..?

Trisha: హాట్ టాపిక్ గా మారిన త్రిష ఉంగరం.. ఎంగేజ్మెంట్ అయిపోయిదా..?

రెండు జెనరేషన్స్ తో కలిసి నటించిన టాప్ హీరోయిన్లలో త్రిష ఒకరు. తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమా ల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ భామ. 20 ఏళ్లకుపైగా కెరీర్లో కొనసాగుతు న్న ఈ అమ్మడు ఇప్పటికీ వన్నె తరగని అందంతో ఫ్యాన్సు అలరిస్తోంది. వయసు, ఇమేజ్ దృష్ట్యా చాలా సెలెక్టివ్గానే సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లోంది. 'పొన్నియస్ సెల్వన్' చిత్రంతో సెకండ్ ఇన్సింగ్స్ లోనూ మంచి హిట్ అందుకుంది. 

ఇటీవల విదాముయార్చి, ఐడెంటిటీ వంటి మూవీలతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు తెలుగులో మెగాస్టా ర్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్, సూర్య 45 సినిమాలోనూ, అలాగే రామ్ అనే చిత్రంలో నటిస్తూ 2025 లో బిజీగా ఉంది. అయితే 41 ఏండ్లు గడిచినా కూడా త్రిష ఇంకా పెళ్లి చేసుకోలేదని అందరికీ తెలుసు. కాగా తనపై పలు పుకార్లు మాత్రం లేకపో లేదు. ఓ ప్రముఖ స్టార్ హీరోతో తాను రిలేషన్ లో ఉన్నట్టుగా పలు ఊహాగానాలు తమిళ సినీ వర్గాల్లో ఉన్నాయి. 

►ALSO READ | మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తానంటే ప్రోత్సహించలేదు.. వర్కౌట్‌ కాదని అన్నారు.. కానీ..

ఈ నేపథ్యంలో త్రిష చేసిన తాజా పోస్ట్ సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతోంది. తనకి ఎవరో మల్లె పూలు పెడుతున్నట్టుగా ఉంది. కాగా ఇందులో 'ప్రేమ ఎప్పటికీ గెలుస్తుంది' అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చకి దారి తీసింది. 'త్రిష పెండ్లికి సిద్ధమైందా... ఎంగేజ్మెంట్ అయిపోయిం దా' అంటూ అభిమానులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trish (@trishakrishnan)