
నటుడు శరత్ కుమార్ కూతురు, తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ది (Varalaxmi Sarathkumar) నేడు (మార్చి 5న) పుట్టిన రోజు. ఈ సందర్భంగా మార్చి 4న హైదరాబాద్ లోని లెప్రా సొసైటీ ఆర్ఫనేజ్‌కు భర్త నికోలయ్ సచ్‌దేవ్‌తో వెళ్లి తన బర్త్ డే వేడుకలను జరుపుకుంది.
అలాగే అక్కడున్న పిల్లలతో సరదాగా గడిపి, తమ వంతుగా అనాథశ్రమానికి డొనేషన్ అందజేసింది. "ఏ కల్మషం లేని ఈ చిన్నారులతో కలవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా వంతుగా డొనేషన్ ఇచ్చాం. మేం చేసింది చాలా చిన్న సాయమే. అయితే ఈ చిన్న సాయం కూడా వారికి పెద్ద సంతోషాన్ని ఇస్తుంది. అందరూ కలసి ఈ చిన్నారులకు హెల్ప్ చేయండి'' అని వరలక్ష్మీ శరత్ కుమార్ కోరింది.
అలాగే ఈ మధ్యే చెన్నై నుంచి మొత్తంగా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను కాబట్టి.. ఈ సారి పుట్టినరోజు సందర్బంగా హైదరాబాద్‌లో ఏదైనా మంచి కార్యక్రమం చేయాలని అనుకున్నానని అన్నారు. అందులోనూ చాలా మందికి ఈ ఆర్ఫనేజ్ గురించి తెలీదు. సెలబ్రిటీ వస్తే ఆర్ఫనేజ్‌కి ఒక గుర్తింపు వస్తుందని ఆశ. దీని గురించి జనాలకి తెలుస్తుందనే మంచి ఉద్దేశంతో వచ్చిన మీడియా వారికి ధన్యవాదాలు అని తెలిపింది.
వరలక్ష్మి తాను సాయం చేయడమే కాకుండా, అనాథ ఆశ్రమం పరిస్థితులు మరింత మందికి చేరువ అవ్వాలనే సంకల్పం తనలోని మానవత్వాన్ని చూపిస్తుంది. దాంతో సినీ సెలబ్రెటీలు, ఆమె ఫ్యాన్స్ బర్త్ డే విషెష్ చెబుతూ వరలక్ష్మీని అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ALSO READ | మా ఫ్యామిలీలో గొడవలు లేవు.. అమ్మ, నాన్న బాగుంటారు : సింగర్ కల్పన కుమార్తె
ఇటీవలే ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్తో ఆమె ఏడడుగులు వేసింది. నికోలయ్ సచ్‌దేవ్ ముంబైకి చెందిన వ్యాపార వేత్త. ఆర్ట్ గ్యాలరీలు కూడా నిర్వహిస్తుంటాడు. ఆన్‌లైన్‌లో వివిధ రకాల పెయింటింగ్‌లు, ఆర్ట్స్ అమ్ముతుంటాడు. నికోలయ్‌తో వరలక్ష్మీకి 14 ఏండ్లుగా పరిచయం ఉంది. అది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లిగా ఆవిష్కరించబడింది.
ఇకపోతే, ప్రస్తుతం వరలక్ష్మీ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాను నటించిన క్రాక్, హనుమాన్, కోటబొమ్మాలి సినిమాల్లో నటనతో వరలక్ష్మీ తెలుగు వారికి తనలోని ప్రత్యేకతను చూపించింది. దాంతో అవకాశాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి.