బషీర్ బాగ్, వెలుగు : తెలంగాణలో ఆక్యుపంక్చర్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఆక్యుపంక్చర్ డాక్టర్ల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ ఆక్యుపంక్చర్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఆక్యుపంక్చర్ వైద్య విధానానికి స్వతంత్ర వైద్య విధానంగా కేంద్రం 2019లో గుర్తింపు ఇచ్చిందని సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.ఎస్. సాగర్, అధ్యక్షుడు సుధీర్ తెలిపారు.
ఆక్యుపంక్చర్ విధానంతో పెయిన్ కిల్లర్స్ వాడకం తగ్గుతుందన్నారు. సర్జరీలు కూడా వీలైనంత వరకు తగ్గించుకోవచ్చన్నారు. ఈ వైద్య విధానం ప్రస్తుతం 135 దేశాల్లో అమలులో ఉందన్నారు. ఆక్యుపంక్చర్తో అన వసర సర్జరీల అవసరం లేకుండా, ఆధునిక జీవనశైలితో వచ్చే 70 శాతం వ్యాధులను తగ్గించవచ్చన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈ వైద్యంపై మంచి అవగాహన ఉందని... పోర్త్ సిటీ లో తమను కూడా భాగస్వామ్యం చేసి... తమ వైద్యాభివృద్ధికి సహకరించాలని కోరారు