ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యం ప్రమాదంలో ఉంది: ఢిల్లీమంత్రి అతిషీ

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో ఉందని ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ డయాబెటిక్ పేషెంట్.. జ్యూడిషయల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ ప్రమాదకర స్థాయిలో క్షీణించాయని ఢిల్లీ మంత్రి అతిషీ ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టి కేజ్రీవాల్ ను జైల్లో పెట్టేందుకు కుట్ర్ పన్నారు. ఆయన ఆరోగ్యం  ప్రమాదంలో ఉందని అతిషీ అన్నారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బరువు 8.5 కేజీలు తగ్గిందని, ఇప్పటికీ 50సార్లు షుగర్ లెవెల్స్ పడిపోయాయని అతిషీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది షుగర్ వ్యాధి ఉన్నవారికి ప్రమాదకర పరిస్థితి.. కేజ్రీవాల్ కు స్ట్రోక్ వస్తే.. మెదడు దెబ్బతినే అవకాశం ఉంది.. దీనికి ఎవరు బాధ్యులని ఢిల్లీ మంత్రి అతిషీ ప్రశ్నించారు. జైలు ఉన్నందున ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సరైన వైద్యం అందడం లేదని ఆమె ఆరోపించారు.

ఆప్ లాయర్లు, డాక్టర్లను సంప్రదించి కోర్టు ఆశ్రయిస్తామని చెప్పారు.కేజ్రీవాల్ కు ఏమైనా అయితే దేశ ప్రజలే కాదు.. దేవుడుకూడా వారిని క్షమించరని ఢిల్లీ మంత్రి అతిషీ అన్నారు.