Bastar Trailer: బస్తర్ ట్రైలర్ రిలీజ్..అదా శర్మ మరో కాంట్రవర్షియల్ మూవీ

Bastar Trailer: బస్తర్ ట్రైలర్ రిలీజ్..అదా శర్మ మరో కాంట్రవర్షియల్ మూవీ

పలు చిత్రాల్లో  హీరోయిన్‌‌గా గ్లామర్ రోల్స్‌‌తో ఆకట్టుకున్న అదా శర్మ (Adah sharma). ప్రస్తుతం లీడ్ రోల్స్‌‌లో వరుస సినిమాలు చేస్తోంది. రీసెంట్‌‌గా ‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో పాన్ ఇండియా వైడ్‌‌గా గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం అదా శర్మ ది కేరళ స్టోరీ టీమ్‌‌తో మరో ప్రాజెక్టు చేస్తోన్న విషయం తెలిసిందే.

అదా శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న బస్తర్ (Bastar)  ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దట్టమైన అటవీ ప్రాంతంలో నక్సలిజం చుట్టూ తిరిగే వాస్తవికతతో ఈ సినిమా తెరకెక్కింది.

బస్తర్ జిల్లాలో నక్సల్స్కి, ఇండియన్ ఆర్మీకి మధ్య పరస్పరం కాల్పులు జరుగడం..రెడ్ కారిడార్ లో భాగమైన ఈ ప్రాంతంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం వంటి సీన్స్ ఆసక్తిగా ఉన్నాయి.

పాకిస్థాన్ తో జరిగిన నాలుగు యుద్ధాల్లో చనిపోయిన మన భారత సైనికుల కంటే ఈ మావోయిస్టులు చంపిన సైనికుల సంఖ్యే రెట్టింపుగా ఉందనే..డైలాగ్ ఆలోచింపజేస్తుంది.

దట్టమైన అడవుల్లో నక్సల్స్ సృష్టిస్తున్న హింసకు అడ్డుకట్ట వేయడానికి వచ్చిన ఐపీఎస్ అధికారి పాత్రలో అదా శర్మ కనిపించబోతుంది. ఈ మూవీ మార్చి 15న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేసి తెరకెక్కించారు. 

ఇక బస్తర్ సినిమా కూడా మరోసారి వివాదాలకు కేంద్రబిందువు అయ్యే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా కోసం ఎంచుకున్న కథ అలాంటిది.మరి రిలీజ్ అయ్యాక ఎలాంటి విమర్శలకు కేరాఫ్ గా మారుతుందో చూడాలి.