ఆ భయంతోనే విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చారు: ఆడమ్ గిల్‌క్రిస్ట్

ఆ భయంతోనే విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చారు: ఆడమ్ గిల్‌క్రిస్ట్

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ మొదటి రెండు వన్డేలకు విరాట్ కి విశ్రాంతిని ఇవ్వగా.. మూడో వన్డేకు జట్టుతో చేరతాడని సెలక్టర్లు ప్రకటించారు. అయితే గత రెండేళ్లు చూసుకుంటే విరాట్ ఆడిన మ్యాచులకంటే ఆడని మ్యాచులే ఎక్కువగా ఉన్నాయి. లాంగ్ గ్యాప్ తర్వాత ఆసియా కప్ ఆడిన "కింగ్" కి ఆస్ట్రేలియా సిరీస్ లో రెస్ట్ ఇవ్వడం ఇప్పుడు కొత్త అనుమానాలకు దారి తీస్తుంది. ఈ విషయంపై ఆసీస్ దిగ్గజం గిల్ క్రిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేసాడనే వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

 అలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదు

ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్ క్రిస్ట్ క్రికెట్ లో ఎంత మర్యాదస్తుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంపైర్ నాటౌట్ గా  ప్రకటించిన కొన్ని సందర్భాలలో నిజాయితీగా అవుట్ అని పెవిలియన్ కి వెళ్ళేవాడు.  అయితే ఈ మాజీ ఆసీస్ ఓపెనర్.. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తాడనే ఉద్దేశంతోనే విరాట్ కోహ్లీని కొన్ని రోజులుగా వరుసగా మ్యాచులు ఆడించడం లేదని చెప్పుకోచ్చాడు.ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న గిల్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

దీంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, సచిన్ టెండూల్కర్‌ని ట్రోల్ చేస్తూ పోస్టులు చేయడం మొదలెట్టారు. అయితే తాజాగా ఈ విషయంపై గిల్ క్రిస్ట్ వివరణ ఇవ్వడంతో ఈ వివాదానికి తెరపడింది. నేను ఇలా ఎప్పుడూ ఈ వ్యాఖ్యలు చేయలేదు. అంటూ వివరణ ఇచ్చాడు. దీంతో సచిన్- విరాట్ ఫ్యాన్స్ మధ్య గొడవకి బ్రేక్ పడగా.. ఈ ట్వీట్ ఎవరో ఆడమ్ గిల్‌క్రిస్ట్ కామెంట్ చేసినట్టుగా ఓ వ్యక్తి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడని స్పష్టంగా అర్ధం అవుతుంది. 

ALSO READ : షూటింగ్‌లో ప్రమాదం.. బిల్డింగ్‌పై నుంచి పడి నటుడు మృతి

కాగా విరాట్ ఖాతాలో ఇప్పటివరకు వన్డేల్లో 47 సెంచరీలు ఉన్నాయి. 49 సెంచరీలతో సచిన్ టాప్ లో కొనసాగుతున్నాడు. మరో మూడు సెంచరీలు చేస్తే అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ సరి కొత్త చరిత్ర సృష్టించనున్నాడు. ఇక విరాట్ తో పాటు ఈ సిరీస్ కి కెప్టెన్ రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య, బుమ్రా కి కూడా తొలి రెండు వన్డేలకు రెస్ట్ ఇచ్చారు మొహాలీ వేదికగా రేపటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.