IPL 2025: ఐపీఎల్ నుంచి సన్ రైజర్స్ స్టార్ స్పిన్నర్ ఔట్.. SRH జట్టులో కర్ణాటక పవర్ హిట్టర్

IPL 2025: ఐపీఎల్ నుంచి సన్ రైజర్స్ స్టార్ స్పిన్నర్ ఔట్.. SRH జట్టులో కర్ణాటక పవర్ హిట్టర్

ఐపీఎల్ 2025 లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా భుజం గాయం కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. జట్టులో అసలే స్పిన్నర్లతో ఇబ్బందిపడుతున్న హైదరాబాద్ జట్టుకు ఇది బిగ్ షాకింగ్ అనే చెప్పాలి. ఐపీఎల్ ప్రారంభంలో జంపా రెండు మ్యాచ్ ల మాత్రమే ఆడాడు. రెండు వికెట్లు పడగొట్టి 11.50 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. జంపా స్థానంలో సన్ రైజర్స్ రీప్లేస్ మెంట్ ప్రకటించింది. ఈ ఆసీస్ స్పిన్నర్ స్థానంలో కర్ణాటక బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్‌ను తీసుకున్నారు. 

21 స్మరన్ రవిచంద్రన్‌ ను రూ. 30 లక్షల కనీస ధరకు జట్టులో తీసుకున్నారు. దేశవాళీ క్రికెట్ లో కర్ణాటక తరపున నిలకడగా రాణించే వారిలో స్మరన్ ఒకడు. ఇటీవలి రంజీ ట్రోఫీ సీజన్‌లో అతను 64.50 సగటుతో 516 పరుగులు సాధించాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో 10 మ్యాచ్‌ల్లో 72.16 సగటుతో 433 పరుగులు చేయడం విశేషం. ఆరు టీ20 మ్యాచ్‌ల్లో 34.00 సగటుతో 170 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్‌ 170.00 ఉండడం విశేషం. సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ లో ఈ కర్ణాటక బ్యాటర్ ఆడే అవకాశముంది.

►ALSO READ | ఆ హైదరాబాద్ వ్యాపారవేత్తతో జాగ్రత్తగా ఉండండి : IPL జట్లకు బీసీసీఐ అలర్ట్..!

ప్రస్తుతం సన్ రైజర్స్ ఐపీఎల్ లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోతుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ ల్లో రెండు మ్యాచ్ ల్లో గెలిచి నాలుగు ఓడిపోయింది. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ పై గెల్చి శుభారంభం చేసిన హైదరాబాద్ ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. అయితే పంజాబ్ తో కీలకమైన మ్యాచ్ లో 246 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసి పరాజయాలకు బ్రేక్ వేసింది. సన్ రైజర్స్ తమ తదుపరి మ్యాచ్ గురువారం (ఏప్రిల్ 17) ముంబై ఇండియన్స్ తో తలపడుతుంది. ముంబైలో వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.