వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా తొలి మ్యాచుని గొప్పగా ఆరంభించింది. టాస్ ఓడి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు భారత బౌలర్లు ఆసీస్ కి ఊహించని షాక్ ఇచ్చారు. స్మిత్, వార్నర్ స్వల్ప భాగస్వామ్యం తప్ప ఆసీస్ ఇన్నింగ్స్ లో చెప్పుకోదగ్గ విశేషాలేమి లేవు. భారత బౌలర్లు అంచనాలకు మించి రానించడంతో 200 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు సిద్ధమైంది.
వన్డేల్లో 200 పరుగులలక్ష్యం అంటే ఏ జట్టుకైనా చాలా చిన్న లక్ష్యం. ఇక ప్రపంచంలో టాప్ బ్యాటింగ్ ఆర్డర్ ని కలిగి ఉన్న టీమిండియాకు ఈ స్కోర్ మంచి నీళ్లు తాగినంత సింపుల్ గా భావిస్తారు. కానీ చెన్నై లాంటి స్పిన్ ట్రాక్ పై ఏమైనా జరగొచ్చు. స్వల్ప లక్ష్యమైనా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రత్యర్థి ఆస్ట్రేలియా ప్రపంచంలోనే బెస్ట్ లైనప్ కలిగి ఉంది. ముఖ్యంగా వారి ప్రధాన స్పిన్నర్ జంపాతోనే అసలు సమస్య.
ALSO READ : Cricket World Cup 2023: ఆసీస్‌ని వణికించారు: వరల్డ్ కప్ తొలి మ్యాచులో అదరగొట్టిన భారత బౌలర్లు
జంపాకు టీమిండియా బ్యాటర్ల మీద మంచి రికార్డ్ ఉంది. పిచ్ స్పిన్ కి అనుకూలిస్తే చెలరేగిపోవడం ఖాయం. మరోవైపు స్టార్క్ టాప్ ఫామ్ లో ఉండనే ఉన్నాడు. వీరికి తోడు మిగిలిన బౌలర్లు రాణిస్తే ఆసీస్ విజయం సాధించినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి చిన్న లక్ష్యం అని ఆసీస్ బౌలర్లని నిర్లక్ష్యం చేస్తే భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.