AUS vs SL: పాక్ అడుగుజాడల్లోనే శ్రీలంక.. ఆసీస్ ముందు స్వల్ప లక్ష్యం

AUS vs SL: పాక్ అడుగుజాడల్లోనే శ్రీలంక.. ఆసీస్ ముందు స్వల్ప లక్ష్యం

వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్ ఏకపక్షంగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓపెనర్లు మంచి శుభారంభం ఇచ్చినా.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు దాన్ని సద్వినియోగం చేసుకోవడంతో విఫలమయ్యారు. చివరి 9 వికెట్లను కేవలం 52 పరుగుల వ్యవధిలో కోల్పోయిన లంక.. ఆసీస్ ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. 

ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసిన లంకకు ఓపెనర్లు అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చారు. కుశాల్ పెరీరా, పాతుమ్ నిస్సంక ఆసీస్ బౌలర్లను అలవోకగా ఆడేశారు. ఈ క్రమంలో వీరి భాగస్వామ్యం 100 పరుగులు దాటింది. ఎట్టలకే వీరి భాగస్వామ్యానికి కెప్టెన్ ఫ్యాట్ కమ్మిన్స్ బ్రేక్ వేసాడు. నిశాంకను అవుట్ చేసి ఆసీస్ కి తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత క్రీజ్ లో కి వచ్చిన కెప్టెన్ కుశాల్ మెండిస్, పెరీరా స్వల్ప భాగస్వామ్యాన్ని నిర్మించాడు. 
 
ఒక దశలో వికెట్ నష్టానికి 157 పరుగులు చేసిన శ్రీలంక స్కోర్ 300 స్కోర్ దాటుతుందని భావించారు. ఈ దశలో ఆసీస్ బౌలర్లు విజ్రంభించడంతో  లంక బ్యాటర్లు పెవిలియన్ కి క్యూ కట్టారు. దీంతో కేవలం 209 పరుగులకే పరిమితమైంది. శ్రీలంక బ్యాటర్లలో నిస్సంక (61), కుశాల్ పెరీరా (78) అర్ధ సెంచరీలు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 2, జంపాకి 4 వికెట్లు దక్కాయి.