
హండ్రెడ్ లీగ్ లో భాగంగా ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా మరోసారి తన స్పిన్ మ్యాజిక్ చూపించాడు. గింగరాలు తిప్పుతూ ప్రత్యర్థి బ్యాటర్ ను షాక్ కు గురి చేశాడు. ఓవల్ ఇన్విన్సిబుల్స్ తరపున ఆడుతున్న జంపా 65 వ బంతిని లెగ్ సైడ్ దిశగా వేశాడు. ఈ బంతిని వెల్ష్ ఫైర్ బ్యాటర్ టామ్ కోహ్లర్-కాడ్‌మోర్ డిఫెన్స్ ఆడదామనుకుంటే బంతి అనూహ్యంగా టర్న్ అయ్యి వికెట్లను గిరాటేసింది. దీంతో క్లీన్ బౌల్డయ్యాడు. జంపా అద్భుత డెలివరీ అతని వద్ద సమాధానం లేకుండా పోయింది.
ఇన్నింగ్స్ మొత్తం ఇబ్బంది పడిన కాడ్‌మోర్ 33 బంతుల్లో కేవలం 22 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్ లో మొత్తం మూడు వికెట్లు పడగొట్టిన జంపా మ్యాచ్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. కోహ్లర్-కాడ్‌మోర్, కెప్టెన్ టామ్ అబెల్ తో పాటు విల్లీ వికెట్ తీసుకున్నాడు. మొత్తం 20 బంతుల్లో 24 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. జంపా సూపర్ బౌలింగ్ తో ఓవల్ ఇన్విన్సిబుల్స్ పది పరుగుల తేడాతో వెల్ష్ ఫైర్‌పై విజయం సాధించి వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫెరీరా 30 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 25 పరుగులు చేసి విల్ జాక్స్ పర్వాలేదనిపించాడు. లక్ష్య ఛేదనలో వెల్ష్ ఫైర్ 100 పరుగులకే పరిమితమైంది. జంపా మూడు వికెట్లు పడగొట్టగా.. సామ్ కరణ్ రెండు వికెట్లతో రాణించాడు.
But seriously, though...
— The Hundred (@thehundred) July 28, 2024
How good is Adam Zampa?! 😳#TheHundred pic.twitter.com/e8I2CGpRDy