హైదరాబాద్, వెలుగు : తమ ఎయిర్‌పోర్ట్ బిజినెస్‌ను త్వరలో మార్కెట్లో లిస్ట్చేసే ఆలోచన ఉందని అదానీ ఎంటర్‌ప్రైజెస్ వైస్– ప్రెసిడెంట్ జీత్ అదానీ అన్నారు. నగరంలో బుధవారం జరిగిన డ్రోన్ లాంచింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కంపెనీ పరిధిలోని అన్ని విమానాశ్రయాల సామర్థ్యాన్ని విస్తరిస్తున్నామని, గత ఏడాది ఇవి ఏకంగా 8 కోట్ల మంది ప్రయాణికులకు సేవలను అందించాయని చెప్పారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్ కొన్ని టార్గెట్లను చేరుకున్నాకే స్టాక్ మార్కెట్లకు వెళ్తుందని అన్నారు.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ 100 శాతం అనుబంధ సంస్థ అయిన అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ మంగళూరు, లక్నో, అహ్మదాబాద్, గౌహతి, జైపూర్, తిరువనంతపురం, ముంబై ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తోంది. మనదేశ విమాన ప్రయాణీకుల్లో 25 శాతం మంది వీటి నుంచి ప్రయాణిస్తున్నారు. భారతదేశం ఎయిర్ కార్గో ట్రాఫిక్‌లో అదానీ ఎయిర్‌పోర్ట్స్‌కు 33 శాతం వాటా ఉంది.