అస్సాంలో అంబానీ, అదానీ రూ.లక్ష కోట్ల ఇన్వెస్టమెంట్

అస్సాంలో అంబానీ, అదానీ రూ.లక్ష కోట్ల ఇన్వెస్టమెంట్
  • అంబానీ, అదానీ ప్రకటన

న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ మంగళవారం అస్సాంలోని వివిధ రంగాలలో ఒక్కొక్కరు రూ. 50వేల కోట్ల పెట్టుబడి పెడతామని ప్రక టించారు. గౌహతిలో జరిగిన అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్‌‌మెంట్ అండ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్‌‌లో ఈ ప్రకటనలు చేశారు. దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.  

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ రూ. 50వేల కోట్ల పెట్టుబడి ద్వారా అస్సాం వృద్ధిని వేగవంతం చేస్తామని, టెక్నలాజికల్​పవర్​హౌస్​గా మారుస్తామని అన్నారు. 

"2018 పెట్టుబడి సమ్మిట్‌‌లో రూ. ఐదు వేల కోట్ల పెట్టుబడిని ప్రకటించాను. అప్పటి నుంచి పెట్టుబడుల విలువ రూ. 12వేల కోట్లు దాటింది. ఈ మొత్తం ఇప్పుడు నాలుగు రెట్లు పెరుగుతుంది.  

మేము రాబోయే ఐదు సంవత్సరాలలో రూ. 50వేల కోట్లు పెట్టుబడి పెడతాము" అని ఆయన అన్నారు.  ప్రభుత్వ 'యాక్ట్ ఈస్ట్, యాక్ట్ ఫాస్ట్, యాక్ట్ ఫస్ట్' కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ అస్సాంకు చాలా వేగంగా అభివృద్ధి చెందే సత్తా ఉందని అంబానీ అన్నారు.  అస్సాం యువత ఏఐలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.  

అదానీ గ్రూప్ చైర్‌‌పర్సన్ గౌతమ్ అదానీ మాట్లాడుతూ తమ గ్రూపు విమానాశ్రయాలు, ఏరో- సిటీస్​, సిటీ గ్యాస్​ డిస్ట్రిబ్యూషన్, సిమెంట్  రోడ్డు వంటి ప్రాజెక్టులలో రూ. రూ. 50వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని చెప్పారు. మధ్యప్రదేశ్​లో రూ.లక్ష కోట్లు ఇన్వెస్ట్​చేస్తామని ప్రకటించిన మరునాడే అదానీ ఈ విషయం చెప్పారు.