కోల్బెల్ట్: మోదీ ప్రభుత్వం సంపన్నులకు కొమ్ము కాస్తుందని టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఎంపీ ఎలక్షన్లలో బీజేపీ గెలిస్తే మళ్లీ ఎన్నికలు రావు అని అన్నారు. బడుగు, బలహీన వర్గాలు అధికారం పొందాలంటే ఓటుతో ఢిల్లీ సర్కార్ ను దించాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరపున చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావ్, ఏఐటీయూసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య, సీనియర్ జర్నలిస్టు మునీర్ తో కలిసి జైపూర్ మండలం ఇందారం ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిపై గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా ప్రొఫెసర్కోదండరామ్మాట్లాడుతూ ‘మోదీ రామాలయం గుడి కట్టి ప్రపంచంలో గుర్తింపు వచ్చిందంటున్నడు. దేశం అభివృద్ధి అయిదంటున్నడు. బీజేపీ వచ్చాక అదానీ, అంబానీ ఆదాయం పెరిగింది. వాళ్లకు పన్ను రాయితీ, పబ్లిక్ సంస్థలు, గనులు ఇచ్చిండు. వాళ్లను వెంట విమానంలో దేశదేశాలకు తీసుకవెళ్లి కాంట్రాక్టులు ఇప్పించిండు. మరి ప్రజల ఆస్తులు ఎందుకు పెరగలేదు. ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేశాడా. 10 ఏళ్ల లో ప్రజాల ఆదాయం తగ్గింది. పన్నులు 300 శాతం పెరిగింది, 58 లక్షల జీఎస్టీ పన్ను ముక్కు పిండి వసూలు చేసింది. ప్రజల ఖర్చులు పెరిగాయి కానీ ఆదాయం తగ్గుతుంది’ అని అన్నారు.
కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీసిండు : వివేక్ వెంకటస్వామి
మాజీ సీఎం కేసీఆర్ రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని చెన్నూరు వివేక్ వెంకటస్వామి అన్నారు. సింగరేణి కార్మికులను బీఆర్ఎస్మోసం చేసిందన్నారు. ‘ప్రధాని మోదీ రూ.16 లక్షల కోట్లు అదానీ, అంబానీలకు రుణమాఫీ చేశాడు. ప్రజలకు, రైతులకు ఏమి చేయలేదు. ప్రభుత్ రంగ సంస్థలు ఉండకుండా మోదీ కుట్రలు చేసిండు. ప్రశ్నించేవారిపై ఈడీ, ఐటీ దాడులతో అణిచివేయాలని చూస్తున్నరు. బీజేపీ విధానాలు రాజ్యాంగ వ్యతిరేకం. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేసిండు. ఈ ఏడాదిలోనే తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తం. మందమర్రి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు ట్రైనింగ్ ఇస్తున్నం. .సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేశాం. ఎన్నికల కోడ్ తర్వాత మిగిలినవి అమలు చేస్తాం. రాహుల్ గాంధీ పాంచ్ న్యాయతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. వంశీని మీ సొంత కొడుకు, తమ్ముడు అనుకోని గెలిపించాలి’ అని విజ్ఞప్తిచేశారు.
కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి : బి.వెంకట్రారావు
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థివంశీకృష్ణ కార్మికుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి అని మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రారావు అన్నారు. ‘బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే రాజ్యాంగం మార్చుతుంది. భవిష్యత్తు లో ఎన్నికలు ఉండవు. కాకా వెంకటస్వామి దయ వల్లనే పెన్షన్ వచ్చింది. 1997లో రూ. 1,297 కోట్ల సింగరేణి నష్టాల్లో ఉంటే ఎన్టీపీసీ నుంచి రూ 450 కోట్లు రుణం ఇప్పించి సంస్థను కాపాడారు’ అని గుర్తు చేశారు.
వంశీకృష్ణతోనే కార్మికులకు న్యాయం : వాసిరెడ్డి సీతారామయ్య
వంశీకృష్ణ పార్లమెంటులో ఉంటే సింగరేణి కార్మికులకు న్యాయం జరుగుతుందని ఏఐటీయూసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. బీఆర్ఎస్హయాంలో సింగరేణికి నష్టం జరిగిందన్నారు. మోదీ ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు పరం చేస్తుండు. అదానీ, అంబానీలకు తక్కువకు అమ్ముతున్నడు. రామాలయం పేరుతో సెంటిమెంట్ తో లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఆపార్టీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగం మార్చుతారు. త్వరలో కొత్త గనులు రావాలి. ఇన్కమ్ ట్యాక్స్ రద్దు, సొంతింటి పథకం కోసం కాంగ్రెస్ సర్కార్ చొరవ చూపాలి. ఇండియా కూటమి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను కార్మిక వర్గం భారీ మెజారిటీతో గెలిపించాలి’ అని కోరారు.