బిగ్ బ్రేకింగ్ : అదానీ లంచం స్కాంలో.. అప్పటి జగన్ ప్రభుత్వ అధికారులు

బిగ్ బ్రేకింగ్ : అదానీ లంచం స్కాంలో.. అప్పటి జగన్ ప్రభుత్వ అధికారులు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్న అదానీ లంచాల కేసు.. ఇప్పుడు ఏపీ రాష్ట్రాన్ని తాకింది. విద్యుత్ ఒప్పందాలు, గ్రీన్ ఎనర్జీ, పవర్ ప్రాజెక్టుల్లో అధిక లాభాల కోసం దేశంలోని పలువురు అధికారులకు 2 వేల 100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీలు బయటపెట్టిన సంగతి తెలిసింది. 

ఆ ఏజెన్సీ తన అభియోగ పత్రంలో అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వంలోని అధికారులను సైతం ప్రస్తావించింది. ఏపీలో విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా.. 200 మిలియన్ డాలర్లు.. అంటే 1680కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు.. అదానీ నుంచి లంచం తీసుకున్నట్లు అదానీపై నమోదైన అభియోగ పత్రంలో ప్రస్తావించారు.

ALSO READ : Congress Vs Adani:అదానీ గ్రూప్ లావాదేవీలపై పార్లమెంటరీ విచారణ జరపాలి:కాంగ్రెస్

2021లో SECIతో విద్యుత్ సరఫరా ఒప్పందానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు అదానీ గ్రీన్ నుండి $200 మిలియన్ల మేరకు లంచాలు అందుకున్నారని అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టులో ఆరోపించారు.

2019-24లో అధికారంలో ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 

నేరారోపణ ప్రకారం..గౌతమ్ అదానీ 2021 ఆగస్టులో అప్పటి ఏపీ సీఎం జగన్ రెడ్డితో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు .విద్యుత్ సరఫరా ఒప్పందం , రాష్ట్ర ప్రభుత్వం 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకోవడానికి అవసరమైన లంచాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.  ప్రభుత్వ అధికారులకు లంచం ఇస్తానని కూడా అదానీ వాగ్దానం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.