న్యూఢిల్లీ: విమానాలకు ఏవియేషన్ మెయింటనెన్స్, రిపేర్, ఓవర్హాల్(ఎంఆర్ఓ) సేవలు అందించే ఎయిర్వర్క్స్ను రూ.400 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువతో కొన్నట్టు అదానీ గ్రూప్ సోమవారం ప్రకటించింది. ఈ సంస్థలో 85.8 శాతం వాటా కోసం షేర్పర్చేజింగ్ అగ్రిమెంట్కుదుర్చుకుంది.
ఎయిర్వర్క్స్మనదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ఎంఆర్ఓ కంపెనీ. 35 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎయిర్వర్క్స్లో 1,300 మంది పనిచేస్తున్నారని అదానీ గ్రూపు పేర్కొంది.