![డ్రోన్ దాడులను అడ్డుకునే... వెహికల్ మౌంటెడ్ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ](https://static.v6velugu.com/uploads/2025/02/adani-defence--aerospace-and-drdo-unveil-indias-vehicle-mounted-counter-drone-system-at-aero-india-2025_ANhDntCK7Z.jpg)
డ్రోన్ దాడులను అడ్డుకునే సరికొత్త వెహికల్ మౌంటెడ్ కౌంటర్ డ్రోన్ వ్యవస్థను బెంగళూరులో జరుగుతున్న ఏడో ఇండియా ప్రదర్శనలో డీఆర్ డీవో ఆవిష్కరించింది. ఈ వ్యవస్థను అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, డీఆర్ డీవోలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వాహనంలో అమర్చి ఉండే ఈ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ ద్వారా డ్రోన్ దాడులను సమర్థవంతంగా అడ్డుకోవచ్చు. ఇందులో అత్యాధునిక లేజర్, రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రో ఆప్టికల్సెన్సర్లు, జామర్లతోపాటు 7.62 ఎంఎం గన్ ఉంటాయి. 10 కిలోమీటర్ల పరిధిలో శత్రు డ్రోన్లను ఇది కూల్చివేయగలదు.