న్యూఢిల్లీ: రూ.25 వేల కోట్ల విలువైన భడ్లా–-ఫతేపూర్ హెచ్వీడీసీ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నట్లు అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) మంగళవారం ప్రకటించింది. అదానీ గ్రూప్ సంస్థ గెలుచుకున్న అతిపెద్ద ట్రాన్స్‌మిషన్ ఆర్డర్ ఇదే. ఫలితంగా తమ ఆర్డర్ బుక్ విలువ ఇప్పుడు రూ.54,761 కోట్లకు చేరుకుందని ఏఈఎస్ఎల్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
ఈ ప్రాజెక్ట్ రాజస్థాన్ నుంచి ఉత్తరాదిలోని డిమాండ్ కేంద్రాలకు 6 గిగావాట్ల రెన్యువబుల్‌ఎనర్జీని తరలిస్తుంది. దీనిని 4.5 సంవత్సరాలలో పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. టారిఫ్ బేస్డ్ కాంపిటిటివ్ బిడ్డింగ్ మెకానిజం కింద ఏఈఎస్ఎల్ ఈ ప్రాజెక్ట్‌ను గెలుచుకుంది. ఈ ప్రాజెక్ట్ ఎస్పీవీని జనవరి 20న ఏఈఎస్ఎల్కి బదిలీ చేశారు.