అదానీ లాభం సగమైంది

అదానీ లాభం సగమైంది

ముంబై: అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ లాభం సెప్టెంబర్​ 2023 క్వార్టర్లో 51 శాతం తగ్గిపోయింది. క్యూ2 లో కంపెనీకి  రూ. 228 కోట్ల లాభం వచ్చింది. ఇదే క్వార్టర్లో కంపెనీ రెవెన్యూ కూడా 41 శాతం తగ్గి రూ. 22,517 కోట్లకు పడింది. ఇతర ఆదాయం రెండు రెట్లు పెరిగి రూ. 549 కోట్లకు చేరినప్పటికీ, నికరలాభం మాత్రం తగ్గిపోవడం విశేషం. సీక్వెన్షియల్​గా చూస్తే లాభం 66 శాతం, రెవెన్యూ 11 శాతం పడిపోయాయి. సెప్టెంబర్​ 2023 క్వార్టర్లో ఇబిటా మాత్రం 30 శాతం ఎక్కువై రూ. 2,430 కోట్లయిందని అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ తెలిపింది. గ్రీన్ ​హైడ్రోజన్​ ప్రాజెక్టుల బిజినెస్​, ఎయిర్​పోర్ట్​ బిజినెస్​లు రెండూ తాజా క్వార్టర్లో మంచి పనితీరు చూపించినట్లు కంపెనీ వెల్లడించింది.