- మూడో క్వార్టర్లో రూ.57.83 కోట్లే
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(ఏఈఎల్) గత డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్ఫలితాలను ప్రకటించింది. కోల్ ట్రేడింగ్ వ్యాపారం దెబ్బతినడంతో ఈసారి లాభం 97 శాతం పడిపోయి రూ.57.83 కోట్లే నమోదయింది. అంతకుముందు ఏడాది మూడో క్వార్టర్లో రూ.1,888.45 కోట్ల లాభం వచ్చింది. కార్యకలాపాల నుంచి వచ్చే రెవెన్యూ తొమ్మిది శాతం తగ్గి రూ.22,848.42 కోట్లకు పడిపోయింది. పన్నుకు ముందు లాభం (ఇబిటా) రూ.745 కోట్లకు తగ్గింది. పవర్ సెక్టార్ నుంచి డిమాండ్ తగ్గడంతో లాభాలపై తీవ్ర ప్రభావం కనిపించింది. ఆస్ట్రేలియన్ డాలర్ విలువ తగ్గడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల కాలానికి నికరలాభం 17 శాతం పెరిగి రూ.3,254 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం ఆరు శాతం పెరిగి రూ.72,763 కోట్లకు చేరుకుంది. న్యూ ఎనర్జీ వెర్టికల్ ఇబిటా 26 శాతం పెరిగి రూ.237 కోట్లకు చేరుకుంది.