న్యూఢిల్లీ: అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) అనుబంధ సంస్థ ఏహెచ్ఈజేఓఎల్ రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో 390 మెగావాట్లు విండ్-సోలార్ హైబ్రిడ్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఇది దేశంలోనే మొట్టమొదటి విండ్– సోలార్ హైబ్రిడ్ పవర్ జెనరేషన్ ఫెసిలిటీ. ఈజేఓఎల్కు సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ)తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ఉంది.
టారిఫ్‌ను ప్రతి కిలోవాట్ అవర్‌కు రూ.2.69 చొప్పున నిర్ణయించారు. ఇది జాతీయ స్థాయిలో సగటు పవర్ ప్రొక్యూర్‌మెంట్ ఖర్చు (ఏపీపీసీ) కంటే చాలా తక్కువని మే 28న రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఏజీఈఎల్ తెలిపింది. ఈ ప్లాంట్‌ను విజయవంతంగా ప్రారంభించడంతో, ఏజీఈఎల్ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇప్పుడు 5.8 గిగావాట్లకు చేరింది.
సోలార్ విండ్ విద్యుత్ ఉత్పత్తి చేసే హైబ్రిడ్ పవర్ ఈ కొత్త ప్లాంట్ ఉత్పత్తి అంతరాయాన్ని పరిష్కరించి, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చుతుందని అదానీ ప్రకటించింది. విండ్-సోలార్ హైబ్రిడ్ ఎనర్జీ తమ వ్యాపార వ్యూహంలో చాలా ముఖ్యమని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎండీ & సీఈవో వినీత్ జైన్ అన్నారు.
ఇవి కూడా చదవండి
2 రోజుల్లో కేరళకు రానున్న రుతుపవనాలు
ఏడాది చివరి నాటికి కొత్త పంబన్ వంతెన పూర్తి