న్యూఢిల్లీ: అదానీ గ్రీన్ ఎనర్జీ ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ1) లో రూ.629 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) సాధించింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌లో వచ్చిన రూ.323 కోట్లతో పోలిస్తే కంపెనీ ప్రాఫిట్ సుమారు డబులయ్యింది. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో హీట్ వేవ్స్ తీవ్రంగా ఉండడంతో కిందటేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే పవర్ డిమాండ్ 10 శాతం పెరిగిందని ఎలరా సెక్యూరిటీ పేర్కొంది.
పవర్ డిమాండ్ పెరగడంతో అదానీ గ్రీన్ ఎనర్జీ సేల్స్ 22 శాతం పెరిగి 735.6 కోట్ల యూనిట్లకు చేరుకున్నాయి. రెవెన్యూ 31.1 శాతం పెరిగి 2,834 కోట్లకు ఎగిసింది. కంపెనీ షేర్లు గురువారం 6 శాతం పెరిగి రూ.1,821 దగ్గర క్లోజయ్యాయి.