
న్యూఢిల్లీ: అదానీ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్కు సెప్టెంబరు క్వార్టర్లో కన్సాలిడేటెడ్ నికర లాభంలో దాదాపు 39 శాతం పెరిగి రూ.515 కోట్లకు చేరుకుంది. అధిక ఆదాయాల నేపథ్యంలో లాభాలు భారీగా పెరిగాయని తెలిపింది. సెప్టెంబరు 30, 2023తో ముగిసిన క్వార్టర్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 371 కోట్లుగా ఉందని బీఎస్ఈ ఫైలింగ్ తెలిపింది. కంపెనీ మొత్తం ఆదాయం ఈ క్వార్టర్లో రూ.2,589 కోట్ల నుంచి రూ.3,376 కోట్లకు పెరిగింది.