ముంబైలో అదానీ గ్రూప్ కన్వెన్షన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ముంబైలో అదానీ గ్రూప్ కన్వెన్షన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ముంబై:  ముంబైలో అతిపెద్ద  ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఐసీసీ) ను ఏర్పాటు చేయాలని అదానీ గ్రూప్ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.16,600 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐసీసీని ఏర్పాటు చేయనుండగా, ఇందులో 275 రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కూడిన అతిపెద్ద 5 స్టార్ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా నిర్మించనున్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏ) ఇప్పటికే  కంపెనీ ఐసీసీ డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుమతి ఇచ్చిందని, బ్లూప్రింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుమతులు ఇంకో రెండు నెలల్లో వస్తాయని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.  

ముంబైలోని విలేపార్లే  శివార్లలో, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దగ్గరలో ఈ కన్వెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించనున్నారు. అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన అదానీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ హోల్డింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీనిని నిర్మిస్తుంది.  మేనేజ్ చేస్తుంది. ఇప్పటికే  రిలయన్స్ జియో ముంబైలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జియో వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్వెన్షన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పోటీపడనున్నాయి.  ఇండియాలోని అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ యశోభూమి  ఢిల్లీలో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.