న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌కు శ్రీలంక ప్రభుత్వం షాకిచ్చింది. కరెంట్ సప్లయ్‌కు సంబంధించి చేసుకున్న అగ్రిమెంట్‌ను రద్దు చేసింది. అదానీ గ్రూప్ కోట్ చేసిన ధర ఎక్కువగా ఉందని పేర్కొంది. ‘అదానీ గ్రీన్ ఎనర్జీ మన్నర్, పూనెర్యన్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న విండ్ పవర్ ప్రాజెక్ట్‌లను రద్దు చేయలేదు. కానీ, గత ప్రభుత్వంతో ఈ కంపెనీ 2023 లో చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్‌ను రద్దు చేశాం’ అని శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధి నలింద జయతిసా క్లారిఫై చేశారు.
విండ్ పవర్ ప్రాజెక్ట్‌లను రద్దు చేసే ఉద్దేశం లేదని, కానీ వీటిని రివ్యూ చేసేందుకు కమిటీ ఏర్పాటు చేశామని అన్నారు. రివ్యూ పూర్తయ్యాక చర్యలు తీసుకుంటామని వివరించారు. కాగా, రణిల్ విక్రమసింగే నేతృత్వంలోని గత శ్రీలంక ప్రభుత్వం అదానీ గ్రూప్‌తో 20 ఏళ్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్‌ను కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం యూనిట్ కరెంట్‌ను రూ.71 కు అదానీ గ్రూప్ సరఫరా చేయాలి. శ్రీలంకలోని లోకల్ కంపెనీలు ఇంత కంటే తక్కువ ధరకే కరెంట్ సప్లయ్ చేయడానికి ముందుకొచ్చాయి.