
న్యూఢిల్లీ: జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ (జేఏఎల్)ను దివాలా ప్రక్రియ ద్వారా కొనుగోలు చేయడానికి అదానీ గ్రూప్ ఆసక్తి చూపించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) సబ్మిట్ చేసిందని పేర్కొన్నాయి. సిమెంట్, విద్యుత్, హోటళ్లు, నిర్మాణం, రియల్ ఎస్టేట్ వంటి వివిధ వ్యాపారాల్లో జేఏఎల్ ఉంది. జూన్ 3, 2024న ఈ కంపెనీపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ), అలహాబాద్ బెంచ్ దివాలా ప్రాసెస్‌ను ప్రారంభించింది.
కాగా, జేఏఎల్‌ను విడదీయకుండా మొత్తం కంపెనీని దివాలా ప్రాసెస్‌లో అమ్మేందుకు బిడ్స్ పిలవాలని ఎన్‌సీఎల్‌టీ ఈ నెల ప్రారంభంలో ఆదేశించింది. ఈ కంపెనీ వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న మొత్తం అప్పులు ఈ ఏడాది ఫిబ్రవరి 20 నాటికి రూ.55,493.43 కోట్లుగా ఉన్నాయి. జేపీ గ్రూప్‌లో మరో కంపెనీ జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను దివాలా ప్రాసెస్ ద్వారా ముంబై కంపెనీ సురక్ష గ్రూప్ ఇప్పటికే కొనుగోలు చేసింది.