
న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత విలువైన టాప్ 1000 కంపెనీల్లో అదానీ గ్రూప్‌కు చోటు దక్కింది. స్టాటిస్టాతో కలిసి టైమ్ విడుదల చేసిన లిస్ట్‌లో 736 వ ర్యాంక్‌ను దక్కించుకుంది. అదానీ గ్రూప్‌కు చెందిన ఎనిమిది లిస్టెడ్ కంపెనీలను విశ్లేషించి ఈ ర్యాంక్ ఇచ్చారు.
అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్, అంబుజా సిమెంట్స్, అదానీ పవర్, అదానీ విల్మార్‌లను టైమ్– స్టాటిస్టా గుర్తించాయి. ఇండియా నుంచి మొత్తం 22 కంపెనీలకు ఈ లిస్ట్‌లో చోటు దక్కింది.
హెచ్‌సీఎల్ టెక్ (112 వ ర్యాంక్) , ఇన్ఫోసిస్ (119) , విప్రో (134), మహీంద్రా గ్రూప్ (187) మనదేశం నుంచి టాప్‌లో ఉన్నాయి.