మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌కు భారీ ఆర్డర్‌‌‌‌‌‌‌‌

మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి  అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌కు భారీ ఆర్డర్‌‌‌‌‌‌‌‌
  • 25 ఏళ్ల పాటు 6,600 మెగావాట్ల కరెంట్‌‌‌‌ను సప్లయ్ చేయనున్న కంపెనీ

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వానికి  6,600 మెగావాట్ల రెన్యూవబుల్‌‌‌‌, థర్మల్ కరెంట్‌‌‌‌ను అదానీ గ్రూప్ సప్లయ్ చేయనుంది. యూనిట్‌‌‌‌ను రూ.4.08 కే సప్లయ్ చేయడానికి ముందుకొచ్చింది. జేఎస్‌‌‌‌డబ్ల్యూ ఎనర్జీ, టొరెంట్ పవర్‌‌‌‌‌‌‌‌ల కంటే బెటర్ ప్రైస్‌‌‌‌ను కోట్ చేసి, ఆర్డర్ దక్కించుకుంది. కరెంట్‌‌‌‌ను  25  ఏళ్ల వరకు అదానీ గ్రూప్‌‌‌‌ సప్లయ్ చేయనుంది. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తున్న కరెంట్ ధరతో పోలిస్తే యూనిట్‌‌‌‌కు రూపాయి తక్కువకే అదానీ గ్రూప్‌ సప్లయ్ చేయడానికి ముందుకొచ్చింది. మహారాష్ట్ర స్టేట్‌‌‌‌ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎంఎస్‌‌‌‌ఈడీసీఎల్‌‌‌‌)  లెటర్ ఆఫ్ ఇంటెంట్‌‌‌‌ ఇష్యూ చేసింది. 

ఇంకో  48 నెలల్లో పవర్ సప్లయ్ మొదలవుతుంది.  అదానీ పవర్ తన కొత్త 1,600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్‌‌‌‌ నుంచి 1,496 మెగావాట్లను (నికరంగా) సప్లయ్ చేస్తుందని , మిగిలిన 5 వేల మెగావాట్లను   గుజరాత్‌‌‌‌లోని ఖవాడా రెన్యూవబుల్‌‌‌‌ ఎనర్జీ పార్క్‌‌‌‌ నుంచి అదానీ గ్రీన్ ఎనర్జీ  సప్లయ్ చేస్తుందని అదానీ గ్రూప్  పేర్కొంది. సోలార్ పవర్‌‌‌‌‌‌‌‌ను  యూనిట్‌‌‌‌కు రూ.2.70 కే  25 ఏళ్ల పాటు కంపెనీ సప్లయ్ చేయనుంది. థర్మల్ కరెంట్‌‌‌‌ ధర మాత్రం కోల్ ధరలను బట్టి  మారుతుంది.