రూ.90 వేల కోట్ల ఇబిటా..  అదానీ టార్గెట్​

రూ.90 వేల కోట్ల ఇబిటా..  అదానీ టార్గెట్​

న్యూఢిల్లీ:  అదానీ గ్రూప్ రాబోయే 2–-3 ఏళ్లలో రూ. 90 వేల కోట్ల ఇబిటాను (ట్యాక్స్‌‌‌‌లు కట్టకముందు లాభం),  ఏడాది ప్రాతిపదికన 20 శాతం వృద్ధిని సాధించాలని టార్గెట్​గా పెట్టుకుంది.  విమానాశ్రయాల నుంచి ఇంధనం వరకు  అన్ని వ్యాపారాలలో బలమైన వృద్ధి నేపథ్యంలో తమ బిజినెస్​లు మరింత ముందుకు వెళ్తాయనే నమ్మకంతో ఉంది.  యూఎస్​ షార్ట్ సెల్లర్ హిండెన్​బర్గ్​ అదానీ గ్రూప్‌‌పై​ తీవ్రమైన విమర్శలు చేయడంతో షేర్లు విపరీతంగా నష్టపోయాయి. ఈ సమస్యల నుంచి గట్టెక్కడానికి, పెట్టుబడిదారుల నమ్మకాన్ని తిరిగి పొందడానికి  గ్రూప్  2.65 బిలియన్ డాలర్ల విలువైన అప్పులను తిరిగి చెల్లించింది. విమానాశ్రయాలు, సిమెంట్, రెన్యువబుల్​ ఎనర్జీ, సోలార్ ప్యానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, రవాణా,  లాజిస్టిక్స్,  పవర్  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిషన్ వంటి రంగాలలో బలమైన వృద్ధి ఉందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.  కొత్త మౌలిక సదుపాయాల పెట్టుబడులతోనూ ఆశించిన ఫలితాలు వస్తాయని అంటున్నాయి.

రాబోయే సంవత్సరాల్లో నగదు ఉత్పత్తి, ఇబిటా భారీగా ఉంటుందని కంపెనీ భావిస్తోంది.   ఇటీవలి సంవత్సరాలలో అదానీ గ్రూప్​ పోర్టులలో భారీగా పెట్టుబడులు పెట్టింది. రెన్యువబుల్​ ఎనర్జీ, రవాణా  పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు సంబంధించిన ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేసింది. విమానాశ్రయాలు, రెన్యువబుల్​ ఎనర్జీ వ్యాపారాల నుంచి క్యాష్​ఫ్లోలు పెరుగుతున్నాయి. గ్రూప్ లిస్టెడ్ పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోలియో ఇబిటా 2023 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 ఆర్థిక సంవత్సరం)లో వార్షికంగా 36 శాతం  పెరిగి రూ. 57,219  కోట్లకు చేరుకుంది.  పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోలియోలో 82.8 శాతం ఉన్న కోర్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇబిటాలో 23 శాతం వార్షిక వృద్ధితో రూ.47,386 కోట్లకు చేరాయి. అదానీ ఎంటర్​ప్రైజెస్​లిమిటెడ్​ (ఏఈఎల్​)  ప్రస్తుత వ్యాపారాల విలువ కూడా 59 శాతం వార్షిక వృద్ధితో రూ. 5,466 కోట్లకు చేరింది. ఏఈఎల్​ ప్రస్తుత వ్యాపారాలు దాని పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోలియోలో 10 శాతాన్ని కలిగి ఉన్నాయి.  సమీప కాలంలో చెప్పుకోదగ్గ లోన్​ మెచ్యూరిటీ ఏమీ లేదని అదానీ గ్రూప్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ తెలిపింది.