న్యూఢిల్లీ: జర్మనీ చెందిన హైడెల్‌బర్గ్ మెటీరియల్స్ ఇండియన్ సిమెంట్ కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ చర్చలు జరుపుతోందని ది ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. డీల్ అంచనా విలువ 1.2 బిలియన్ డాలర్లు. కంపెనీ అంబుజా సిమెంట్‌లో హోల్సిమ్ వాటాను కొనుగోలు చేయడం ద్వారా 2022లో సిమెంట్పరిశ్రమలోకి ప్రవేశించింది.
ఆ తర్వాత అదానీ గ్రూప్ హైదరాబాద్ ఆధారిత పెన్నా సిమెంట్‌ను కూడా కొన్నది. 2006లో భారత్‌లోకి ప్రవేశించిన హెడల్‌బర్గ్ నాలుగు ప్లాంట్లను నిర్వహిస్తోంది. మైసెమ్, జువారీ అనే రెండు బ్రాండ్ల పేరుతో సిమెంట్‌ను విక్రయిస్తుంది.